ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: చేనేతలకు నారా లోకేష్ ఆర్థిక సహకారం

ABN, Publish Date - Nov 10 , 2024 | 02:05 PM

చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 17 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రారంభమైన పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.. ఏపీవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు.

మంగళగిరి: చేనేత రంగంలో మహిళలు రాణించాలని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి–విజయవాడ బైపాస్‌‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(పీఐడబ్ల్యూఏ)ఆధ్వర్యంలో నూతన పద్మశాలీ భవన్‌ను నిర్మిస్తున్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌‌కు పీఐడబ్ల్యూఏ సభ్యులు, కూటమి నేతలు, కార్యకర్తలు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేనేతలతో కలిసి మంత్రి లోకేష్ ఫొటోలు దిగారు.


ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్‌ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామని అన్నారు. చేనేత వర్గానికి చెందిన పేద విద్యార్థులు, చేనేత కుటుంబాలకు దాదాపు రూ. 3 కోట్లకు పైగా సహాయ సహకారాలు అందించినట్లు గుర్తుచేశారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. 17 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రారంభమైన పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.. ఏపీవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు. పీఐడబ్ల్యూఏ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా, అభివృద్ధి కార్యక్రమాలు, నూతన పద్మశాలి భవన్‌ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ అడిగి తెలుసుకున్నారు.


వారికి టీడీపీ అండగా ఉంటుంది: బాలస్వామి

విజయవాడ: మంచి చేసే వారికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్ బాలస్వామి అన్నారు. ఆశ్రిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు కుట్టు మిషన్లు ,తోపుడు బండ్లు, ఐరన్ బాక్సులు పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్ బాలస్వామి వరద బాధితులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. చంద్రబాబుని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛంద సంస్థ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని ఆశ్రిత ఫౌండేషన్ ఫౌండర్ వెంకటేశ్వరరావు , కృష్ణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని ఇలా కుట్టు మిషన్లు పంచడం శుభ పరిణామమని కొనియాడారు. వరద బాధితులకు సహాయం చేయడం సామాన్య విషయం కాదని బాలస్వామి అన్నారు.


చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నాం: వెంకటేశ్వరరావు

వరదల సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస్సులో ఉండి సామాన్య ప్రజలకు సేవలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నామని ఆశ్రిత ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. తమకు ఉన్న దానిలో ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. వరదల సమయంలో చాలామందికి ఇంటింటికి వెళ్లి భోజనం ప్యాకెట్లు అందించినట్లు తెలిపారు. అదే దృఢ సంకల్పంతో చంద్రబాబుని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కుట్టు మిషన్లు, ఐరన్ బాక్స్ లు ,తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నామని ఆశ్రిత ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..

రక్షణ కోరుతున్న వైసీపీ సైకోలు..

లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 10 , 2024 | 02:31 PM