ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala Ramanaidu: జగన్ కుటుంబ వివాదంలో టీడీపీ జోక్యం చేసుకోదు

ABN, Publish Date - Oct 26 , 2024 | 05:14 PM

సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని చెప్పారు.

రాజమండ్రి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ క్యారెక్టర్ ఎంటో దేశమంతా అర్థమైందని అన్నారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని చెప్పారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అమల్లో సమస్యలు గుర్తించామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


జిల్లాలకు సంబంధించిన సమస్యలపై ఇవాళ(శనివారం) అధికారులతో సమావేశంలో చర్చించామని తెలిపారు. మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు మీడియా సమావేశంలో పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... ఓపెన్ ఇసుక రీచ్‌ల్లో వారం రోజుల్లో ఇసుక తవ్వకాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని అన్నారు.


వైసీపీ పాలనలో టన్ను ఇసుక రూ.625 ఉంటే ప్రస్తుతం టన్ను ఇసుక రూ. 215కే అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. రోడ్లు మరమ్మతులు మూడు నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. ఇరిగేషన్ నిర్వహణ కోసం రూ. 980 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ. 275 కోట్లు మాత్రమే ఇరిగేషన్ నిర్వహణ కోసం ఖర్చు చేశారని చెప్పారు. లిప్ట్ ఇరిగేషన్‌లకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.


కార్యాచరణ రూపొందించాం: మంత్రి కందుల దుర్గేష్

క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని నిర్ణయించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, అబివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.


జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఫైర్

పార్వతీపురం మన్యం జిల్లా: ‘ఆస్తి కోసం సొంత తల్లిని, చెల్లిని కోర్టులో నిలబెట్టిన జగన్ నువ్వు మనిషివా’ అని మంత్రి గుమ్మడి సంధ్యరాణి ప్రశ్నించారు. తండ్రి వైఎస్సార్ పోటీ చేసిన సమయంలో సొంత ఇల్లు కూడా లేదని.. అలాంటిది ఇన్ని ఆస్తులు జగన్ ఏ విధంగా సంపాదించారని నిలదీశారు. ఒకప్పుడు ఇళ్లు కూడా లేని రాజశేఖరరెడ్డి కొడుకుకు ఇప్పుడు ఎన్ని ఇళ్లు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. జగన్ ఇంత ఆస్తి ఏ విధంగా సంపాదించారు.. రాళ్లు కొట్టి సంపాదించారా అని విమర్శించారు. ఏపీలో ఉన్న వారందరూ అక్కచెల్లెమ్మలే అని చెప్పుకునే జగన్, సొంత అమ్మని బయటకు తోసేసి , చెల్లికి కోర్టుకు లాగారని మంత్రి గుమ్మడి సంధ్యరాణి ధ్వజమెత్తారు.


సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల గురించి జగన్ ఏ విధంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో పలకరించని మనిషివి, మొన్న గుర్లలో కేవలం రాజకీయ రంగు కోసం పలకరింపులు చేశారని విమర్శించారు. 74 మంది మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పిన మాజీ మంత్రి రోజా కనీసం ఏడుగురు పేర్లు అయినా చెప్పాలని ప్రశ్నించారు. రోజా ఆవిధంగా మాట్లాడేందుకు సిగ్గుండాలని అన్నారు. ఐదేళ్లలో కనీసం ఒక్క ఆడపిల్లకు కూడా రక్షణ కల్పించలేకపోయారని మండిపడ్డారు. ఏదైనా సంఘటన జరిగితే చంద్రబాబు ఆదేశాల మేరకు శాఖల పరమైన మంత్రులే నేరుగా వెళ్తున్నారని తెలిపారు. ప్రజలు వైసీపీని ఛీ కొట్టినా విషయం మర్చిపోవద్దు.. ఇంకా జగన్‌ను ప్రజలు ఛీ కొడుతునే ఉన్నారనే విషయం మరిచిపోద్దని అన్నారు. వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఇంతవరకు చెక్కులు ఎందుకు పంపిణీ చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యరాణి ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: అంజిరెడ్డి పట్ల సీఎం చంద్రబాబు ఆసక్తి.. ఇంతకీ ఎవరీయన

Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాకు లోకేష్.. అపూర్వ స్వాగతం

AP Govt: ధరల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 05:24 PM