Palla Srinivasa Rao: సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేరుస్తాం
ABN, Publish Date - Jun 30 , 2024 | 03:18 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు (CM Nara Chandra Babu Naidu) ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు (CM Nara Chandra Babu Naidu) ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు. చంద్రబాబు రేపు ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తారని అన్నారు. పెద్దల ఆస్తుల అన్యకాంతం అవ్వకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామన్నారు కార్యకర్తలపై నమోదు చేసిన రాజకీయ ప్రేరేపిత కేసులు వచ్చే మూడు నెలల్లో పూర్తిగా తీసివేస్తామని మాటిచ్చారు. మంత్రి మండలిలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ముఖ్య మంత్రి చంద్రబాబు కలిసేందుకు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు.
సమస్యలపై వచ్చే వారికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. రిజిస్టర్ చేయించుకున్న వారిని ప్రాధాన్యత క్రమంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. చంద్రబాబుకు వినతులు అందించేందుకు, ఫొటోలు దిగేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి జనం పోటెత్తుతున్నారన్నారు వారి నుంచి వినతులు స్వీకరణకు కొత్త మార్గంగా టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్ 7306299999 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలియపరిస్తే చంద్రబాబును కలిపించేందుకు యత్నిస్తు్మన్నారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలను చెప్పి రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పరిష్కారం కాని సమస్యలు ఉంటే కేంద్రకార్యాలయానికి రావాలని విన్నవించారు. ఒకేసారి పింఛన్ రూ. 1000 పెంచి రూ.4000 వేలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. జూలై 1న పింఛన్ దారులను రూ. 7000 పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ చేయనున్నారని చెప్పారు. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
Updated Date - Jun 30 , 2024 | 09:52 PM