ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: వారిని కోల్పోవడం చాలా బాధాకరం.. పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్

ABN, Publish Date - Nov 18 , 2024 | 10:19 AM

ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో హిందువులపై అరాచకాలు, దురాగతాలు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే ఈ సంఘటనటపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.

అమరావతి: పాకిస్థాన్‌లో హిందూ మహిళల ఆత్మహత్యల‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్(ఎక్స్)లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావోద్వేగంతో పోస్ట్ చేశారు. ‘‘పాకిస్థాన్‌లో హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితి గురించి ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారీ నాకు చాలా బాధ కలుగుతుంది. హేమ, వెంటిల ఆత్మహత్యల ఘటన నన్ను‌ కలచి వేసింది’’ అని పవన్ కల్యాణ్ భావోద్వేగం వ్యక్తం చేశారు.


అత్యంత దుర్భర పరిస్థితుల్లో..

కాగా.. పాకిస్థాన్‌లో మైనారిటీలైన హిందువులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు. హిందూ బాలికలకు కనీస రక్షణ కరువైంది. 15 రోజుల్లో నలుగురు హిందూ బాలికలు అపహరణకు గురవడంతో మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ హిందూ బాలికను దుండగులు అపహరించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె జాడ తెలియడం లేదు.


హిందువులు, ఇతర మైనారిటీలు పాకిస్థాన్ జనాభాలో కేవలం 3.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ మైనారిటీలంతా మెజారిటీ ముస్లింల చేతుల్లో మత హింసకు గురవుతున్నారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ఉద్దేశించిన బిల్లును గత ఏడాది అక్టోబరులో పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది.


పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్, హైదరాబాద్ పట్టణంలో ఇటీవల ఓ హిందూ బాలిక చంద్ర మహరాజ్‌ను కొందరు దుండగులు అపహరించారు. బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నదాని ప్రకారం, చంద్రను ఫతే చౌక్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. ఆమె ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆమె జాడ ఇంకా తెలియడం లేదు. కొద్ది రోజుల క్రితం ముగ్గురు హిందూ మహిళలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మైనారిటీ హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..

గనుల ఘనుడు వెంకటరెడ్డి విడుదల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 10:24 AM