Pawan Kalyan: మోదీ అమెరికా పర్యటనపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 24 , 2024 | 09:11 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ప్రతి భారతీయుడి ఆత్మను కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ స్పందించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ప్రతి భారతీయుడి ఆత్మను కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ స్పందించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘‘ మోదీ ప్రతి కరచాలనం, ప్రతి ప్రసంగం, 1.4 బిలియన్ ప్రజల ఆశలు, కలలను మోసుకెళ్లారు. క్వాడ్ సమ్మిట్‌కు నాయకత్వం వహించడం నుంచి యూఎన్ ఫ్యూచర్ సమ్మిట్ వరకు, మోదీ నాయకత్వం ప్రపంచ వేదికపై భారతదేశం బలాన్ని ప్రదర్శించింది. మోదీ ప్రభావవంతమైన సమావేశాలు-సెమీకండక్టర్ ప్లాంట్‌ను భద్రపరచడం, 297 అమూల్యమైన పురాతన వస్తువులను తిరిగి పొందడం. అత్యాధునిక సాంకేతికతలో భాగస్వామ్యాన్ని ఏర్పరచడం భారతదేశ పునరుజ్జీవనంలో మైలురాళ్లు’’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ALSO READ: AP GOVT: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ధాన్యం కొనుగోలుపై కీలక ప్రకటన
మరోవైపు.. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మోదీ లాంటి రాజనీతి గలవారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం. భారతదేశ స్ధానాన్ని కమిటీలో సుస్ధిరం చేయడంతోపాటు ప్రపంచ స్ధాయి నాయకునిగా ఆయన ఎదిగారు. దేశాలను, జాతులను ఐక్యం చేయడంలో ప్రధాని కృషి ప్రశంసనీయం. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రపంచ యవనికపై భారత్ పాత్రను రానున్న రోజుల్లో తెలియజేయనుంది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Konakalla Narayana Rao: సీఎం సముచిత స్థానం కల్పించారు
Ganta: అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ.. పాల్గొన్న గంటా
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 24 , 2024 | 09:11 PM