ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: నేపాల్‌కు ఎర్రచందనం తరలింపు.. పవన్ సీరియస్

ABN, Publish Date - Jun 22 , 2024 | 09:47 PM

ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని తెలిపారు. నేపాల్ దేశానికి 172 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని తరలించారని చెప్పారు.

Pawan Kalyan

అమరావతి: ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని తెలిపారు. నేపాల్ దేశానికి 172 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని తరలించారని చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... ఇక్కడి నుంచి స్మగ్లర్లు తరలించిన ఎర్ర చందనం నేపాల్ దేశంలోని భద్రత సిబ్బందికి పట్టుబడిందని అన్నారు. అక్కడ ఉన్న రాష్ట్ర ఎర్ర చందనాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎర్ర చందనం పట్టుబడి ఉందో కూడా తెలియజేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


కాలుష్య నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్

రాష్ట్రంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేయాలని ఆదేశించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి నది జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని తెలిపారు. మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయి నేపాల్ దేశంలో పట్టుబడ్డ ఎర్ర చందనాన్ని వెనక్కి తీసుకురావాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి తీరాల్లో కాలుష్యం, కాగితపు పరిశ్రమల నుంచి వస్తున్న జల కాలుష్యంపైనా చర్చించామని అన్నారు. ఈ రెండు జీవ నదుల శుద్ధీకరణపైనా దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.

Updated Date - Jun 22 , 2024 | 09:47 PM

Advertising
Advertising