ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: కొండచరియలు విరిగిపడ్డ ఘటన దురదృష్టకరం

ABN, Publish Date - Aug 31 , 2024 | 08:44 PM

విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటన దురదృష్టకరమని తెలిపారు.

అమరావతి: విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటన దురదృష్టకరమని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.


ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందని చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా ఎనిమిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందించే ఏర్పాటు చేసిందని తెలిపారు. అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులు సాయంగా ఉండాలని కోరారు. ఆహారం, రక్షిత తాగునీరు, వైద్య సహాయం అందించడంలో తోడ్పాటు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Updated Date - Aug 31 , 2024 | 09:06 PM

Advertising
Advertising