AP volunteers: వలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్
ABN, Publish Date - Jun 26 , 2024 | 08:28 PM
ఏపీలో వలంటీర్లను (volunteers) తొలగించాలని ఏపీ హైకోర్టులో(AP High Court) పిటిషన్ దాఖలైంది. సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు (బుధవారం) విచారణ చేపట్టింది.
అమరావతి: ఏపీలో వలంటీర్లను (volunteers) తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో(AP High Court) పిటిషన్ దాఖలైంది. వలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని, నియామకాల్లో వైసీపీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించారంటూ సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు (బుధవారం) విచారణ మొదలైంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - Jun 26 , 2024 | 09:00 PM