ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: వేట మొదలైంది.. సోషల్ మీడియా సైకోల భరతం పడుతున్న పోలీసులు

ABN, Publish Date - Nov 12 , 2024 | 08:21 AM

సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ఇతర మంత్రులతో సహా వారి కుటుంబాల్లోని మహిళలపై బండ బూతులతో విరుచుకుపడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరాచక శక్తులను గుర్తించి కేసులు పెడుతున్నారు.

కృష్ణాజిల్లా (గుడివాడ): ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి ఇవాళ(మంగళవారం) ఉదయం ఆశ్రయించారు. గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఈరోజు హైకోర్టులో భార్గవరెడ్డి పిటిషన్ విచారణకు రానుంది. సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమంలో గుడివాడ ముబారక్ సెంటర్‌కు చెందిన వైసీపీ కార్యకర్త మహ్మద్ ఖాజాబాబా అభ్యంతరకర పోస్టులు పెట్టారని పోలీసులకు గుడివాడ బాపూజీనగర్‌కు చెందిన శ్రీరాం కనకాంబరం ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఖాజాబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.


సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాలతో ఆ పోస్టులు పెట్టానని విచారణలో ఖాజాబాబా వెల్లడించారు. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో సైతం చేర్చి భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వినోద్ తదితరులను ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. జూలై 1వ తేదీ తర్వాత బీఎన్ఎస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని.. జూలైకు ముందు పెట్టిన ఈ కేసులో బీఎన్ఎస్ యాక్ట్ చెల్లదని భార్గవ్ రెడ్డి వ్యాజ్యం వేశాడు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టులో భార్గవ్ రెడ్డి పిటిషన్ వేశాడు.


వైసీపీ సోషల్ మీడియా సైకోల తీగలాగుతున్నా పోలీసులు

కడప: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతగడ్డ పులివెందులలో పోలీసులు వైసీపీ సోషల్ మీడియా సైకోల తీగలాగుతున్నారు. పోలీసులు వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసులను పోలీసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై పులివెందుల పోలీ‌సులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి ఫిర్యాదు మేరకు వీరిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు.


వారిపై ప్రత్యేక నిఘా

మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వైసీపీ సైకో ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సైబర్ నిపుణులతో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ పెద్దలు, మహిళా మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెట్టినా గుర్తించి పట్టుకునే విధంగా సాంకేతికతను వియోగిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక టీమ్‍లను రంగంలోకి దింపారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపులపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP: వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్

మండలి ముద్దు.. సభ వద్దు

నేడు ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై శిక్షణ

Read Latest AP News and Telugu News

Updated Date - Nov 12 , 2024 | 08:39 AM