Lady Aghori: నన్ను ఉరి తీయండి.. మహిళా అఘోరి షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Nov 08 , 2024 | 04:58 PM
తెలుగు రాష్ట్రాల్లో మహిళ అఘోరి సంచరిస్తున్నారు. అఘోరి రావడంతో ఆలయాల వద్దకు భారీగా జనం వస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గో వధ, చిన్నారులపై లైంగికదాడులు అరికట్టాలని కోరారు.
కర్నూలు: గత కొన్ని రోజులుగాతెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి (Female Aghori ) అలియాస్ శ్రీనివాస్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అఘోరి వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని అఘోరి ప్రకటించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంచి పోలీసులు రెండంచెల బందోబస్తు నిర్వహిస్తున్నారు. అఘోరిని చూడటానికి పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. అయితే తెలంగాణ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆయాలను సందర్శిస్తుంది. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో ఇవాళ(శుక్రవారం) లేడీ అఘోరి మాట్లాడారు.
ఉరిశిక్ష వేయండి...
‘‘పోలీసులు ఇబ్బందులు పెట్టడం వల్ల నా కారు యాక్సిడెంట్ అయింది. పోలీసులు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి. చంపేయండి లేదా ఉరిశిక్ష వేస్తే పీడ పోతుంది. కారు ఎప్పుడు నా చేతికి వస్తుందో తెలియదు. కారు రిపేర్ అయ్యేంతవరకు పాదయాత్ర చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం యాగంటికి వెళ్తున్నాను. ఆ తర్వాత మహానంది శ్రీశైలం వెళ్లి పూజలు చేస్తాను’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అఘోరి కలకలం..
అంతకుముందు పిఠాపురంలో మహిళా అఘోరి ప్రత్యక్షమవడం కలకలం రేపింది. పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వచ్చింది. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.కాగా మహిళ అఘోరీ సోమవారం రాత్రి విశాఖపట్నానికి చేరింది. నాగుల చవితి సందర్భంగా మంగళవారం ఉదయం జోడిగుడ్లపాలెంలోని నాగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది హిందుత్వాన్ని కాపాడడం, మహిళల రక్షణ, గో సంరక్షణ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని మనసులోని మాట బయటపెట్టింది. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని, ఏమీ కాదంది. ముఖ్యంగా ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబానికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. తాను పవన్‌ను కలవనని, ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని పేర్కొంది.
చిన్నారులపై లైంగికదాడులు అరికట్టాలి...
తెలుగు రాష్ట్రాల్లో మహిళ అఘోరి సంచరిస్తున్నారు. అఘోరి రావడంతో ఆలయాల వద్దకు భారీగా జనం వస్తున్నారు. కోనసీమ జిల్లా ద్రాక్షారమంలో గల భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని అఘోరి దర్శించుకున్నారు. హిందు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఆలయానికి వెళ్తున్నానని ఆమె ప్రకటించారు. గో వధ, చిన్నారులపై లైంగికదాడులు అరికట్టాలని కోరారు. తనను ఆపాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. లేదంటే మీ సీట్లకు ముప్పు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసేందుకైనా వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు.
వివాదాస్పదంగా మహిళా అఘోరీ
తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులపాటు హల్‌చల్ చేసి, వివాదాస్పదంగా మారిన మహిళా అఘోరీ (నాగసాధువు).. గత సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. సోమవారం సాయంత్రం కారులో అన్నవరం నుంచి విశాఖవైపు వెళ్తూ వేంపాడు టోల్‌ప్లాజా వద్ద ఆగింది. స్థానికులు, టోల్‌ప్లాజా సిబ్బంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో ఒక వ్యక్తి తనపై చేయి వేసి, తాకరాని చోట తాకాడంటూ ఆమె గొడవకు దిగింది. అతనెవరో తనకు తెలియాలని, సీసీ కెమెరా ఫుటేజీ కావాలని టోల్ ప్లాజా సిబ్బందిని డిమాండ్ చేసింది. తాను టోల్‌ఫీజు కోసమని కారు ఆపితే, ఆమె వాహనం నుంచి కిందకు దిగిందని, ఈ సమయంలో తాను చేతిని అడ్డుగాపెట్టానని, ఆమె కింద నుంచి వెళ్లే క్రమంలో చేయి తగిలి వుండవచ్చునని, ఉద్దేశపూర్వకంగా తాకలేదని టోల్‌ప్లాజా వద్ద ఉన్న ఒక వ్యక్తి వివరణ ఇచ్చాడు. ఒక వేళ తప్పయితే క్షమించాలని కోరాడు. ఈలోగా అక్కడకు చేరుకున్న సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ, ఏపీలో కూడా మహిళలకు రక్షణ లేదని, శివ సాన్నిధ్యంలో ఉండే తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నానని చెప్పుకొచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి...
Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్ లాంఛర్ లభ్యం
KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 08 , 2024 | 05:01 PM