Supreme Court: కోడికత్తి కేసులో సుప్రీం కీలక నిర్ణయం
ABN, Publish Date - Jul 15 , 2024 | 05:30 PM
కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది.
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంను ఎన్ఐఏ అధికారులు (జాతీయ దర్యాప్తు సంస్థ) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.
కాగా.. 2019 ఎన్నికల ముందు, విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో శ్రీనివాసరావు దాడి చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్లపాటు జైల్లో శ్రీనివాసరావు ఉన్నారు. అప్పట్లో ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది.
Updated Date - Jul 15 , 2024 | 05:44 PM