Vijayawada: మహా కుంభాబిషేకంపై కీలక వ్యాఖ్యలు చేసిన యూపీ డిప్యూటీ సీఎం..
ABN, Publish Date - Dec 07 , 2024 | 07:39 PM
పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఆలయాన్ని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమరేశ్వరస్వామి, బాలచాముండికా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభాబిషేకం నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) ఇవాళ(శనివారం) పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని అమరావతిని ఆయన సందర్శించారు. అమరేశ్వర ఆలయానికి వచ్చిన ప్రసాద్ మౌర్యకు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్, అధికారులతో కలిసి ఘనస్వాగతం పలికారు. అనంతరం అమరేశ్వరస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలచాముండికా అమ్మవారిని సైతం దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ దర్శనం అనంతరం ధ్యానబుద్ధ ప్రాజెక్ట్, మహాచైత్యంలను ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సందర్శించారు.
ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. "ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దైవిక, అద్భుత, డిజిటల్ మహాకుంభాబిషేకం నిర్వహిస్తుంది. మహాకుంభాబిషేకాన్ని, 2025 సంవత్సరాన్ని భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మార్చాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంకల్పించారు. 45 కోట్ల మందికి పైగా యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులను ఆహ్వానిస్తున్నాం.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకూ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం పవిత్ర ఒడ్డున మహాకుంభాభిషేకం జరుగుతుంది. మహాకుంభాబిషేకాన్ని మానవాళికి అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వంగా యునెస్కో గుర్తించింది. 12 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి పవిత్ర భూమి ప్రయాగలో ఈ మహావేడుక జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ఏర్పాటు, రివర్ ఫ్రంట్ సహా 44 ఘాట్లలో ఫ్లవర్ షవర్లు ఏర్పాటు చేస్తున్నాం. యాత్రికుల సంఖ్యను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లెక్కిస్తాం" అని చెప్పారు.
Also Read:
క్రెడిట్ కార్డ్ తెగ వాడేస్తున్నారా.. షాకింగ్ న్యూస్ మీకోసమే..
పెళ్లి కాకుండానే భర్త.. ఇద్దెక్కడి సంస్కృతి రా బాబూ..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Dec 07 , 2024 | 07:56 PM