ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: సీఎం చంద్రబాబు స్క్రిప్ట్‌ను వైఎస్ షర్మిల చదువుతున్నారు: వరుదు కళ్యాణి

ABN, Publish Date - Sep 28 , 2024 | 10:19 PM

మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ తప్పు చేయలేదు కాబట్టి సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని అన్నారు.

విశాఖపట్నం: మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ తప్పు చేయలేదు కాబట్టి సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. చేసిన తప్పు బయట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.


తిరుమలలో టీటీడీ నిబంధనలు ఉంటాయా, టీడీపీ నిబంధనలు ఉంటాయా అని ప్రశ్నించారు. సభ్యత సంస్కారం లేకుండా హోంమంత్రి అనితా మాట్లాడుతున్నారని చెప్పారు.తాను క్రిస్టియన్ అని చెప్పిన అనితా నేడు, హిందువుని అని చెబుతున్నారని అన్నారు.. అనితా తిరుపతి వెళ్లినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా అని నిలదీశారు.. గతంలో సీఎంగా ప్రతి పక్ష నేతగా వైఎస్ జగన్ తిరుపతికి వెళ్లారని గుర్తుచేశారు. అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని అన్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రితో జగన్ తిరుపతి వెళ్లారని గుర్తుచేశారు.


అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని నిలదీశారు. వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చి, ఇవ్వలేదని అబద్ధం చెబుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు స్క్రిప్ట్‌ను వైఎస్ షర్మిల చదువుతున్నారని అన్నారు. షర్మిలకు సొంత వ్యక్తిత్వం లేదని చెప్పారు. షర్మిల కడుపు మంటతో మాట్లాడుతున్నారని వరుదు కళ్యాణి తెలిపారు.

Updated Date - Sep 28 , 2024 | 10:19 PM