ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: బయటపడ్డ భారీ కుంభకోణం..జగన్ మెడకు మరో కేసు

ABN, Publish Date - Nov 24 , 2024 | 09:24 AM

పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏసీబీ, లేదా సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇవాళ(ఆదివారం) మీడియాతో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ఇది మరో పెద్ద క్విడ్ ప్రో కో డీల్ అని విమర్శించారు. అమెరికా దర్యాప్తు సంస్థ లంచం డబ్బు జగన్‌కు చేరిందని తేల్చేసిందని అన్నారు. ఈ కేసులో అమెరికాలోని అక్కడి దర్యాప్తు సంస్థలు ఏమి చేస్తాయన్నది ఆ దేశంలో కోర్ట్‌లు తెలుస్తాయని తెలిపారు.


కానీ లంచాలు తీసుకున్నది జగన్, ఆ డబ్బులు చేరింది ఏపీకి, నష్టపోయేది రాష్ట్ర ప్రజలని తెలిపారు. అదంతా ప్రజల సొమ్ము అని.. విచారణ జరిపించాలని కోరారు. లంచం డబ్బు తీసుకుని ప్రజలపై భారం మోపేందుకు జగన్ సిద్ధమయ్యారని మండిపడ్డారు. పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడమా? లేక ఏసీబీ విచారణకు అదేశించడమా అనేది వెంటనే చేయాలని యనమల రామకృష్ణుడు కోరారు. అదానీ కంపెనీతో జగన్ ప్రభుత్వ సోలార్ పవర్ కొనుగోళ్ల ఒప్పందాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల కీలక కామెంట్లు చేశారు. జగన్ విషయంలో ఈ ఒప్పందం రెండో అతిపెద్ద క్విడ్ ప్రో కో అని ఆరోపించారు. ‘‘జగన్ క్విడ్ ప్రో కో వ్యవహరంలో విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అదానీతో సోలార్ పవర్ ఒప్పందాల విషయమై సీఎం హోదాలో జగన్ అతి పెద్ద క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.


ఏపీ ఖజానాకు నష్టం..

‘‘జగన్ అవినీతి అక్రమాల చిట్టాలో అదానీతో సోలార్ పవర్ ఒప్పందాలు రెండో పెద్ద క్విడ్ ప్రో కో. జగన్ క్విడ్ ప్రో కో వల్ల ఏపీ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. జగన్ అవినీతి వల్ల ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడుతుంది. ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపించాలి. ఏపీ ప్రభుత్వమైనా ఏసీబీ విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వం హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై సెకీతోనే తప్ప.. అదానీతో ఒప్పందాలే చేసుకోలేదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. సెకీ అనేది కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమే. సెకీకి అదానీ కేసుతో ఎంత మాత్రమూ సంబంధం లేదు. అదానీ-జగన్ డీల్ జరిగిందని స్పష్టంగా కన్పిస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా జగన్-అదానీ మధ్య ఒప్పందం జరిగింది’’ అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.


బట్టబయలైన ‘ముడుపుల బంధం’..

కాగా..వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్‌ అదానీ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.2,029 కోట్ల లంచాలను ఎరవేసింది. ఇందులో ఏకంగా రూ.1,750 కోట్లు ‘జగన్‌ యంత్రాంగానికే’ అందించింది. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ కాదు! మన దేశానికి చెందిన సీబీఐ, ఈడీలు తేల్చిన సంగతీ కాదు. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ), ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, న్యాయ శాఖ నిగ్గు తేల్చిన విషయాలు! దీనిపై ఈస్ట్‌ డిస్ట్రిక్ట్‌ న్యూయార్క్‌ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. అదానీపై అమెరికాలో అరెస్టు వారెంటు జారీ అయ్యింది.


భారతదేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్‌ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకొని, రాష్ట్రాల్లోని విద్యుత్‌ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్యకాలంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ.2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. అందులో రూ.1,750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది.


అసలేం జరిగిందంటే..

భారత సౌర విద్యుత్తు సంస్థ (సెకీ) రాష్ట్రాలకు సోలార్‌ పవర్‌ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్‌ దక్కించింది. దీని ప్రకారం... రాష్ట్రాల డిస్కమ్‌లు ‘సెకీ’తో ఒప్పందం చేసుకుంటే... అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తును సరఫరా చేస్తారు. అయితే... అదానీ కోట్‌ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు. సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి, పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో ‘అదానీ’పై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ ‘లంచాల యాత్ర’ మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్‌ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇందులో... జగన్‌ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా వెల్లడించాయి. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను అదానీ పలుమార్లు స్వయంగా కలిశారు. 2021లో ఆగస్టు 7న జగన్‌తో అదానీ భేటీ అయ్యారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదరకపోవడంపై చర్చించారు. లంచాలు ఆఫర్‌ చేశారు.

ఆ తర్వాత సెప్టెంబరు 12, నవంబరు 20 తేదీల్లోనూ వీరు సమావేశమయ్యారు’’ అని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. జగన్‌తో అదానీ సమావేశాల తర్వాత ఒప్పందాలు ఖాయమైనట్లు అదానీ గ్రూప్‌ కంపెనీల్లో అంతర్గత సందేశాలు షేర్‌ చేసుకున్నారని అమెరికా స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(ఎ్‌సఈసీ) కూడా తన దర్యాప్తులో ధ్రువీకరించింది. ఎఫ్‌బీఐ నేరుగా జగన్‌ పేరు/చీఫ్‌ మినిస్టర్‌ అనే పదాలు వాడకుండా... ‘భారతీయ పౌరుడు’ అని తెలిపింది. ప్రభుత్వంలోని ఆ కీలక వ్యక్తి, అదానీ తరచూ ఫోన్లో మాట్లాడుకున్నట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఎస్‌ఈసీ మాత్రం ఏ మాత్రం మొహమాటానికి పోకుండా అదానీ కలిసింది ముఖ్యమంత్రినేనని, ఆ తర్వాతే కీలక నిర్ణయాలు ముందుకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.

Updated Date - Nov 24 , 2024 | 01:42 PM