ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: జగన్‌పై పార్టీ శ్రేణుల తిరుగుబాటు.. అసలు ఏమైందంటే

ABN, Publish Date - Nov 09 , 2024 | 05:00 PM

2019 నుంచి 2024 వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల నుంచి వినిపించిన మాటలు ఇవే.. అధికారం ఉందనే అహంతో తాము ఏమి చేసినా చెల్లుతుందనుకుని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. పార్టీ శ్రేణులు హద్దులు దాటుతుంటే హెచ్చరించాల్సిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సైలెంట్‌గా ఉండటమే కాకుండా..

నాయకుడంటే జగన్ మాత్రమే.. మా నాయకుడి ముందు అంతా బలాదూర్.. దమ్ముంటే రండి.. మా పార్టీ పేరు చెబితే ఒక్కొక్కడు పోసుకుంటాడు.. 2019 నుంచి 2024 వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల నుంచి వినిపించిన మాటలు ఇవే.. అధికారం ఉందనే అహంతో తాము ఏమి చేసినా చెల్లుతుందనుకుని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. పార్టీ శ్రేణులు హద్దులు దాటుతుంటే హెచ్చరించాల్సిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సైలెంట్‌గా ఉండటమే కాకుండా.. విపక్ష పార్టీ నాయకులను, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిగత జీవితాల గురించి సామాజిక మాద్యమాల్లో ఇష్టారాజ్యంగా మాట్లాడేవిధంగా ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ అధ్యక్షుడు స్వయంగా చెప్పడంతో శ్రేణులు సైతం రెచ్చిపోయారు. సామాజిక మాద్యమాల్లో అనుచిత పోస్టులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీరా వైసీపీపై పీకల దాకా కోపంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్ పార్టీని ఘోరంగా ఓడించారు. వైసీపీ అరాచకపాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారు. అంతేకాదు.. అధికారం ఉందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన, ఫేక్ అండ్ పేటీఎం బ్యాచ్‌‌లపై చర్యలు తీసుకోవాలనే విధంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు చెప్పారు. దీంతో ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టడంతో వైసీపీ కార్యకర్తలకు తత్వం బోధపడినట్లైంది. ఓ వ్యక్తి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తమ జీవితాలను నాశనం చేసుకున్నామని ఆలస్యంగా తెలుసుకున్నారు. పోలీసులు చర్యలు మొదలుపెట్టడంతో తమను వదిలేయండి.. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకే తాము అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేశామంటూ క్షమాపణలు కోరుతున్నారు.


గతంలో అలా..

2019-24 మధ్య కాలంలో వైసీపీ అండదండలు చూసుకుని ఓ నటి జనసేన, టీడీపీ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులపై అనుచిత పోస్టులు పెట్టడంతో పాటు.. అసభ్యకర పదజాలంతో వీడియోలు విడుదల చేశారు. రాజకీయ విమర్శలు కాకుండా.. కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిగత జీవితాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ఐదేళ్ల పాటు తాము ఏం చేసినా చెల్లుతుందనేవిధంగా ప్రవర్తించారు. కేవలం నటి మాత్రమే కాదు.. వైసీపీ సోషల్ మీడియాతో పాటు.. కొంతమంది జగన్మోహన్ రెడ్డి సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడి మెప్పుకోసం పరిమితులు దాటి ప్రవర్తించిన సందర్భాలున్నాయి. భారతదేశంలో చట్టాల ప్రకారం ఎవరైనా వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తప్పుచేస్తే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. ఈ విషయం తెలిసినప్పటికీ వైసీపీకి అధికారం శాశ్వతం అనే భావనతో కొందరు పేటీఎం బ్యాచ్ ఇష్టారీతిలో రెచ్చిపోయారు. తీరా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుడు పనులకు పాల్పడ్డవారిపై చర్యలకు ఉపక్రమించడంతో పేటీఎం బ్యాచ్ తోకముడిచింది. తమకు ఏ పాపం తెలియదని, అధిష్టానం ఒత్తిడి, ఆదేశాలతోనే తప్పుడు పనులు చేశామంటూ వీడియోలు విడుదల చేస్తున్నారు.


ప్రస్తుతం ఇలా..

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురులేదనుకుని రెచ్చిపోయిన వారంతా ప్రస్తుతం క్షమాపణలు కోరుతున్నారు. ఒక్క క్షమాపణలతో చేసిన తప్పులను, అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోగలరా.. వారి తప్పుడు ప్రచారానికి, తప్పుడు పనులకు అవతలి వ్యక్తులు పడిన బాధకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఒక్క సారీతో తప్పించుకుంటే ఇదొక అలవాటుగా మారే ప్రమాదం లేకపోలేదు. మరోసారి ఇష్టారీతిలో తప్పుడు ప్రచారం చేయాలంటే భయపడేలా నిందితులను శిక్షించాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. క్షమాపణ చెప్పారని వదిలేస్తే.. భవిష్యత్తులో మరోసారి తప్పు చేయరనే గ్యారంటీ ఉండదని, సారీ చెప్తే సరిపోతుందనే భావనతో మరికొంతమంది ఇలాంటి పనులు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పేటీఎం బ్యాచ్‌లను వదొలద్దని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 09 , 2024 | 05:00 PM