ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

ABN, Publish Date - Dec 25 , 2024 | 05:59 PM

Rains In AndhraPradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు సూచించింది.

విశాఖపట్నం, డిసెంబర్ 25: పశ్చిమ మధ్య - నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో ఇది క్రమంగా బలహీన పడుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పలు చోట్లు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్లు భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. ఈ సమయంలో సముద్రం తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని సూచించింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్ల వద్దని మత్స్యకారులను ఈ సందర్బంగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక విశాఖపట్నం, కాకినాడ , నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని స్పష్టం చేసింది.


మరోవైపు అల్ప పీడనం కారణంగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. అలాగే ఆకాశం మేఘావృతమైంది. ఇక సరిగ్గా వరి పంట కోతకు వచ్చే సమయంలో ఇలా అల్పపీడం ఏర్పడడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట సరిగ్గా చేతికి వచ్చే సమయంలో ఇలా ముసురు కమ్ముకొని తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

Also Read: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ


ఇంకోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని రైతులు.. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా వరి పంటను కోసి.. చేలలో కుప్పలుగా వేశారు. ఇంకోవైపు భారీ వర్షాలు నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సైతం అప్రమత్తమైంది. ఆ క్రమంలో జిల్లాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. ఎక్కడ ఎటువంటి అంవాఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విద్యుత్, నీటి పారుదల శాఖల అధికారులను అలర్ట్‌గా ఉండాలని సూచించింది.

Also Read: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ

Also Read: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 06:06 PM