IPS ABV Issue: ఏబీవీ సస్పెన్షన్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్.. విచారణ వాయిదా
ABN, Publish Date - Apr 23 , 2024 | 04:56 PM
Andhrapradesh: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను (CAT) వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... ఒకే ఆరోపణలపై రెండవ సారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది.
అమరావతి, ఏప్రిల్ 23: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు (IPS Officer AB Venkateshwar Rao) కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Government)(జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను (CAT) వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... ఒకే ఆరోపణలపై రెండవ సారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది. వేరే అంశాలు ఏవీ నోట్ ఫైల్‌లో లేవని బెంచ్ పేర్కొంది.
Pawan Kalyan: నామినేషన్ అనంతరం జనసేనాని కీలక వ్యాఖ్యలు
ఛార్జ్ షీట్ నాలుగుసార్లు వేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ వాదనతో సంభదం లేకుండా రికార్డ్ ఉందంటూ బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పెగాసిస్, మీడియాతో మాట్లాడిన అంశాలపై ఏబీ వెంకటేశ్వర రావు స్పష్టంగా రిప్లై ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. పరిశీలించకుండా రెండవ సారి సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. అవే ఆరోపణలపై రెండవ సారి విచారణ ఏమిటంటూ ప్రశ్నించిన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్.. తదుపరి విచారణణు ఈనెల 29కి వాయిదా వేసింది.
అసలు ఏం జరిగిందంటే?
కాగా.. ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలో ఆయనపై వైసీపీ ఫిర్యాదులు చేయడంతో ఈసీ ఆయనను పదవి నుంచి తప్పించింది. ఇక వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చాక.. ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు కొనుగోలు చేసి, తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసి ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆపై సుప్రీం కోర్టుకు ఆదేశాలతో ఏబీవీ విధుల్లో చేరారు. అయితే రెండో సారి కూడా ఆయనను సస్పెండ్ చేయడంతో దాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌లో పిటిషన్ వేశారు.
BJP: శ్రీరామ చంద్రుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు.. హనుమాన్ శోభాయాత్రలో కిషన్‌రెడ్డి
గత వారం జరిగిన కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్‌ని బెంచ్ పరిశీలించింది. అది పరిశీలించాక.. సాక్షులను ఏబీవీ బెదిరించినట్లుగా చూపించే మెటీరియల్ ఎక్కడుందని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అలాగే ఏబీవీ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం దాఖలు చేసిన వ్రాతపూర్వక వాదనల్లో వాస్తవిక తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఏబీవీపై విధించిన సస్పెన్షన్ చెల్లదని, ఇది ఇకపై కొనసాగదని నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు ద్వారా ఏబీవీ తిరిగి నియమించబడిన తర్వాత కూడా.. అవే ఆరోపణలతో రెండోసారి సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan Properties: పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా..!
Breaking: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 23 , 2024 | 04:58 PM