బీసీలే కీలకం?
ABN , Publish Date - May 04 , 2024 | 04:38 AM
సామాజిక వర్గాల లెక్కల ప్రకారం డోన్‌లో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 2,27,351 మంది ఓటర్లు ఉండగా.. బీసీలు దాదాపు లక్షా 7 వేల మంది ఉన్నారు.

సామాజిక వర్గాల లెక్కల ప్రకారం డోన్‌లో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 2,27,351 మంది ఓటర్లు ఉండగా.. బీసీలు దాదాపు లక్షా 7 వేల మంది ఉన్నారు.
వారు ఎటువైపు నిలిస్తే ఆ నేతకే విజయావకాశాలు ఎక్కువ. 1967 నుంచి 2009 వరకు బీసీ నాయకులు 9 సార్లు గెలిచారు. ఈసారి వైసీపీ, టీడీపీ నుంచి పోటీ పడుతున్న బుగ్గన, కోట్ల ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే! వీరిలో ఎవరివైపు బీసీ, ఎస్సీలు మొగ్గు చూపుతారోనన్న చర్చ సాగుతోంది.
బీసీలపై దాడులు, ఎస్సీలపై అత్యాచారాల ఘటనలతో ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కేఈ కుటుంబం కోట్ల కుటుంబానికి మద్దతు తెలుపుతోంది. గత రెండు ఎన్నికల్లోనూ కేఈ ప్రతా్‌పపైనే బుగ్గన గెలిచారు. సూర్యప్రకాశ్‌రెడ్డి ఎంపీగా తప్ప. ఏనాడూ అసెంబ్లీకి పోటీచేయలేదు. ఆయన భార్య సుజాతమ్మ 2004లో డోన్‌లోనే పోటీచేసి విజయం సాధించారు.
ప్రభుత్వ వ్యతిరేకత, కూటమి బలం, సూపర్ సిక్స్ హామీలు, కేఈ కుటుంబం, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం తోడ్పాటు తన గెలుపునకు ఉపయోగపడతాయన్న ధీమాతో కోట్ల ఉన్నారు.
మంత్రి బుగ్గనకు ఈసారి సొంత మండలం బేతంచర్లలో ఎదురుగాలి వీస్తోంది. ఆయన మంత్రి అయ్యాక నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. తన సొంత మనుషులు, అనుచరులను తప్ప నాయకులను, కార్యకర్తలను దగ్గరకు రానివ్వరనే విమర్శలున్నాయి. దీంతో చాలామంది ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారు.
చెరువుల్లో నీరు నింపకపోవడంతో గ్రామీణ ప్రజలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డోన్ నియోజకవర్గంలోనే కరువు మండలాలు అధికం. వలసలు, తాగునీటి కష్టాలు ఎక్కువ. ఆర్థిక మంత్రిగా ఉన్నా వీటి నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైసీపీ
బలాలు..
ఆర్థికంగా బలంగా ఉండడం..
టీడీపీలో వర్గపోరు
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీ
బలహీనతలు..
మంత్రిగా సాధారణ ప్రజానీకానికి దూరం కావడం. హామీలను నెరవేర్చడంలో విఫలమవడం.
కార్యకర్తలను దగ్గరకు రానివ్వకపోవడం.
సొంతవారికే కాంట్రాక్టులు, పనులు అప్పగించడం.
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
బలాలు..
కుటుంబ/వ్యక్తిగత ప్రతిష్ఠ
టీడీపీ పటిష్ఠంగా ఉండడం
ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత.
బలహీనతలు
హఠాత్తుగా తెరపైకి రావడం.. కార్యకర్తలను ఏకం చేయలేకపోవడం.. కేఈ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య సమన్వయలేమి.