Share News

Pre-Christmas : ముందస్తు క్రిస్మస్‌ వేడుకలో జగన్‌

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:43 AM

కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

Pre-Christmas : ముందస్తు క్రిస్మస్‌ వేడుకలో జగన్‌

వేంపల్లె, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. బెంగళూరు నుంచి మంగళవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకున్నారు. నేరుగా తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్దకు వచ్చి ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీ్‌షరెడ్డి తదితర నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం విశ్రాంతి భవనంలోకి వెళ్లి పలువురు నాయకులతో కాసేపు చర్చించారు. నెమళ్లపార్కు సమీపంలో ఉన్న ఆడిటోరియంలో తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ముందస్తు క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వేడుకలకు షర్మిల దూరం

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొనే క్రిస్మస్‌ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ వేడుకలకు ఆమె రాలేదని పలువురు వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 25 , 2024 | 04:43 AM