YSRCP vs TDP: వైసీపీకి షాక్.. ఇది కూడా చేజారిపాయే..!
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:50 PM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చాక.. వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తాజాగా జగ్గయ్యపేట మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జగ్గయ్యపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆ పార్టీ శ్రేణులు టీడీపీలో చేరారు.
అమరావతి, సెప్టెంబర్ 13: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చాక.. వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తాజాగా జగ్గయ్యపేట మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జగ్గయ్యపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆ పార్టీ శ్రేణులు టీడీపీలో చేరారు. దీంతో ఈ మునిసిపాలిటీ టీడీపీ కైవసం అయ్యింది. శుక్రవారం నాడు మంత్రి నారా లోకేష్ సమక్షంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, పలువురు వార్డు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో.. 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, 23వ వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు ఉన్నారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు మంత్రి లోకేష్. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే.. వైసీపీ నేతల తీరుపై విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీని వీడుతారనే ప్రచారం జరుగుతోందన్నారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం అని అన్నారు. జగ్గయ్యపేట మునిసిపాలిటీ ఇక టీడీపీది అని అన్నారు. వాస్తవానికి ఈ మునిసిపాలిటీలో టీడీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే, తాజా చేరికలతో టీడీపీ బలం 18కి పెరిగింది. వైసీపీ బలం 13కి పడిపోయింది. దీంతో జగ్గయ్యపేట మునిసిపాలిటీ టీడీపీ వశమైపోయింది. పార్టీ మారిన నేతలు మాట్లాడుతూ.. 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. మునిసిపాలిటీ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు.
ఏలూరులోనూ ఇదే పరిస్థితి..
ఏలూరులోనూ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. నగర కార్పొరేషన్‌లో ఐదుగురు వైఎస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా టీడీపీలో చేరారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.. టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also Read:
ఆంధ్ర సెటిలర్లను కంటికి రెప్పలా చూసుకుంది కేసీఆరే
రంగంలోకి జగన్.. రజినీతో రాయబారం
విచారణకు సహకరించండి.. లేదంటే...
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Sep 13 , 2024 | 04:50 PM