Share News

AP News: కలెక్టర్ కాళ్లయినా పట్టుకుంటా.. జేసీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Nov 05 , 2024 | 10:35 AM

జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా.. హైలెట్ అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సైతం ఇప్పుడు ప్రధాన వార్తల్లో నిలిచాయి. కొంత మంది మహిళలతో మాట్లాడిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు.

AP News: కలెక్టర్ కాళ్లయినా పట్టుకుంటా.. జేసీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
JC Prabhakar Reddy

తాడిపత్రి, నవంబరు 5: జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా.. హైలెట్ అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సైతం ఇప్పుడు ప్రధాన వార్తల్లో నిలిచాయి. కొంత మంది మహిళలతో మాట్లాడిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు. మరి ఆయన ఎందుకలా అన్నారు? కలెక్టర్ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ కథనంలో..


తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి.. మహిళలతో మాట్లాడారు. మండలానికి గోకులం షెడ్లు వచ్చాయని, వాటిని తమకు ఇప్పించండి అని పలు గ్రామాల నుంచి మహిళలు వచ్చి ఆయనకు విన్నవించారు. దీంతో ‘మీరు అభివృద్ధి చెందుతామంటే కలెక్టర్ కాళ్లు పట్టుకుని అయినా ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు గోకులం షెడ్లు మంజూరు చేయాలని కోరతా’ అని ప్రభాకర్ రెడ్డి వారితో అన్నారు. పది ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా తన వద్దకు వస్తున్నారని, తమ పిల్లలకు అల్ట్రాటెక్, అర్దాస్ ప్యాక్టరీల్లో ఉద్యోగం ఇప్పించాలని కోరడం బాధ అనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం పరిశ్రమల్లో రూ.10వేల నుంచి 15 వేలు మాత్రమే ఇస్తున్నారని, కానీ పది ఎకరాల భూమి ఉండి పండించుకోలేక పిల్లలను తల్లిదండ్రులు ఎందుకు చిన్న జీతాలకు పంపుతున్నారో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సరే.. కష్టపడి పనిచేసి ఆర్థికంగా ఎదగాలని ఆయన అన్నారు.


లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం..

వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమైందని జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు లా అండ్ ఆర్డర్‌ను గాలికి వదిలేశారని, ఇది కేవలం రాజకీయం, ధనప్రభావం వల్లే జరిగిందని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్, న్యాయాధికారులు, న్యాయవాదులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయాన్ని కాపాడేవిధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి వాహన లైఫ్ ట్యాక్స్ కట్టించుకుంటే రోడ్డు ప్రమాదాల్లో తగిన భద్రత ఉంటుందని, కనీసం ఐదారేళ్లకు ఒకసారి అయినా రోడ్డుటాక్స్ కట్టించుకోవాలని హోంశాఖ, రవాణాశాఖ మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.


Also Read:

పట్టాలపై పరేషాన్‌.. మెట్రో రాకపోకల్లో అంతరాయం

నాగేంద్రుడి ఆలయాలు భక్తులతో కిటకిట

అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Nov 05 , 2024 | 10:36 AM