ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జేడీ లక్ష్మీనారాయణ యత్నం.. అరెస్ట్

ABN, Publish Date - Mar 01 , 2024 | 03:47 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరుబాట పట్టింది. ఏపీకి హోదా కోసం అఖిలపక్షం వేయాలని, ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం జగన్‌కు డిమాండ్ చేసింది. సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ప్రయత్నించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరుబాట పట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం వేయాలని, ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం జగన్‌ను (CM Jagan) డిమాండ్ చేసింది. సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (Laxmi Narayana), ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ (Srinivas) ప్రయత్నించారు. జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేడీ అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జగన్‌కు జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Prathipati: చెల్లికే అన్నపై నమ్మకం లేకుంటే.. ఇక మాలాంటి వాళ్ల పరిస్థితేంటి?

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతుందని, ఇప్పటివరకు హోదా సాధించలేదని జేడీ లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాష్ట్రానికి హోదా సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని విరుచుకుపడ్డారు. హోదా కోసం అఖిలపక్షం వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జేడీ లక్ష్మీనారాయణ కోరారు. టీడీపీ, జనసేన, కమ్యునిస్టులు అందరం కలిసి ఢిల్లీ వెళదామని, ఏపీకి హోదా కావాలని తాను ప్రధాని మోదీని అడుగుతానని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 04:22 PM

Advertising
Advertising