KA Paul: నన్ను ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడుతా
ABN, Publish Date - Mar 19 , 2024 | 04:33 PM
తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. . దేశాన్ని కాపాడటానికి గత 7 సంవత్సరాలుగా ప్రయత్నిస్తు న్నానని తెలిపారు. మంగళవారం నాడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ...ఎస్. కోట ఎమ్మెల్యే గా, విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు.
విశాఖపట్నం: తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. . దేశాన్ని కాపాడటానికి గత 7 సంవత్సరాలుగా ప్రయత్నిస్తు న్నానని తెలిపారు. మంగళవారం నాడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ...ఎస్. కోట ఎమ్మెల్యే గా, విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు. సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముగ్గురు మోదీ తొత్తులేనని ఎద్దేవా చేశారు. జగన్‌ను మళ్లీ గెలిస్తే మోదీకే మద్దతు పలుకుతారని అన్నారు. మోదీకి జగన్ దత్తపుత్రుడని అన్నారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ. 500 కోట్ల విలువైన క్రిస్టియన్ ఛారిటీ స్థలాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.
TDP MP Candidates List Live Updates: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చేసిందహో..!
అందుకే బీజేపీలో చేరలేదు..
రూ. 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంటుని రూ. 8వేల కోట్లకి ఎందుకు అమ్మేస్తున్నారని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలను ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశాన్ని అమ్మేశారని ధ్వజమెత్తారు. రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్, చంద్రబాబు కావాలా... రూ.5 లక్షలు కోట్లు సంపాదించే పాల్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అందుకే తాను ఆ పార్టీతో కలవలేదని అన్నారు. కాపు నేత ముద్రగడను తమ పార్టీలో చేరమంటే నో అన్నారని.. ఏ పార్టీకి అమ్ముడు పోనని అన్నారని... మరి ఇప్పడు ఆయన జగన్ పార్టీలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తన ఫంక్షన్ హాల్ టాక్స్ కట్టాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను పంపిస్తావా అని కేఏ పాల్ హెచ్చరించారు.
AP News: వైసీపీ నేతకు చెందిన బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుమందికి తీవ్రగాయాలు
Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డిని రహస్యంగా కలిసిన జనసేన నేత రాజబాబు..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2024 | 04:33 PM