Chandrababu: నేడు కడప జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు..
ABN, Publish Date - Mar 30 , 2024 | 07:30 AM
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ (Elections Schedule)విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ(YCP), తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు.
కడప : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ (Elections Schedule)విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ(YCP), తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బుధవారం రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా నేడు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులోప్రజాగళం (Prajagalam) బహిరంగసభ నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లో ఉదయం11 గంటలకు బహిరంగ సభ జరగనుంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ బహిరంగ సభకు భారీగా తరలి రానున్నారు.
Pawan Kalyan: పిఠాపురంపై పవన్ ఫోకస్..
తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రజాగళం యాత్ర (Prajagalam Yatra)లో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించారు. ఇక నేడు కడప జిల్లాలో పర్యటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. చంద్రబాబు ఈ నెలాఖరు వరకూ ప్రజాగళం పేరుతో రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 30 , 2024 | 07:31 AM