Bhuvaneswari: కడపలో భువనేశ్వరి పర్యటన.. ఎండను కూడా లెక్క చేయకుండా...
ABN, Publish Date - Apr 04 , 2024 | 01:57 PM
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జిల్లా పర్యటన కొనసాగుతోంది. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. వైసీపీ రాక్షసపాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు.
కడప, ఏప్రిల్ 4: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari) జిల్లా పర్యటన కొనసాగుతోంది. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. వైసీపీ (YSRCP) రాక్షసపాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు.
వైసీపీ చేసే ప్రతీ తప్పును చంద్రబాబుపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి, ఇసుక, భూకబ్జాలు, కల్తీ మద్యం మాఫియా ముఠాలలో ఏపీని వైసీపీ ముందు వరుసలో నిలబెట్టిందని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం జిల్లాలకు చేరుకున్న భువనేశ్వరి ముందుగా నగరంలోని 44 డివిజన్ చమ్ముమియాపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చెండ్రాయుడు అనే భాదితుడి కుటుంబాన్ని పరామర్శించారు. చెండ్రాయుడు చిత్రపటానికి పూలమాలవేసి భువనేశ్వరి పరామర్శించారు.
Viral News: బాయ్ ఫ్రెండ్‌ని కూడా ఇంట్లోనే పెట్టాలన్న భార్య, ఒప్పుకోని భర్త.... ఆమె ఏం చేసిందంటే..!
భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర..
ఈరోజు నుంచి కడప, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల్లో భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగనుంది. కడప, ప్రొద్దుటూరు, డోన్, నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈరోజు నుంచి మొదలయ్యే టూర్‌లో 12 మంది కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. నందికొట్కూరులో 1, పాణ్యంలో 2, శ్రీశైలంలో 3, నంద్యాలలో 2, డోన్‌లో 2, ప్రొద్దుటూరులో 1, కడపలో 1 కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.
ఇవి కూడా చదవండి...
AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపీణీపై ఓ కన్నేసిన సీఈసీ
Chief Minister: ప్రధానిని చేస్తామన్నా నేను బీజేపీవైపు వెళ్లను..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 04 , 2024 | 02:03 PM