YS Vijayamma: కూతురు షర్మిల వైపా.. వైఎస్ జగన్ వైపా..?
ABN, Publish Date - Apr 04 , 2024 | 04:13 AM
YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా, కూతురు షర్మిల వైపా, లేదంటే వివేకాను చంపిన అవినాశ్‌రెడ్డి వైపా..?..
కూతురు షర్మిల వైపా.. మరిదిని చంపిన అవినాశ్ వైపా..?
ప్రశ్నించిన టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి
కడప, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ (YS Vijayamma) ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా (YS Jagan) , కూతురు షర్మిల వైపా (YS Sharmila) , లేదంటే వివేకాను చంపిన అవినాశ్‌రెడ్డి వైపా..? చెప్పాలని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి డిమాండ్ చేశారు. ‘‘కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని షర్మిల స్పష్టంగా చెప్పారు. చిన్నాన్నను చంపిన వారిని పోటీ పెట్టినప్పుడు తాను పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
విజయమ్మను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా.. మీ ఇద్దరు బిడ్డలు మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు వైఎస్ సమాధి వద్దకు వెళ్లారు కదా.. నీబిడ్డ అని చెప్పుకొనే జగన్... రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల పోటీ చేస్తున్నారు.. వైఎస్‌కు ఆత్మ ఉంటే తన కూతురు వైపు నిలబడతాడా నిలబడరా..? తమ్ముడు వివేకాను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తన కూతురుపై పోటీకి నిలబెడితే వైఎస్ ఆత్మ ఎంత క్షోభిస్తుందో పులివెందుల ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి’’ అన్నారు. ‘‘విజయమ్మ..మీరు కూతురు షర్మిల వైపు ఉంటారా, లేదా మీ కొడుకు, కోడలు మాటలు విని మీ మరిదిని చంపిన అవినాశ్ వైపు ఉంటారా..? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం పులివెందుల వాసులకైనా తెలపాలి’’ అని కోరారు.
వైసీపీకి ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 04 , 2024 | 08:14 AM