ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aurobindo Group : కొండనూ కొట్టేశారు

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:26 AM

కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్‌లో అరబిందో నిర్మిస్తున్న గేట్‌వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్‌ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో....

  • అరబిందోకు అడ్డగోలుగా మేళ్లు

  • కాకినాడ సెజ్‌లో నిర్మిస్తున్న గేట్‌వే పోర్టుకు 125 ఎకరాల్లో కొండ సమర్పయామి

  • పదేళ్లు నల్లరాయి తవ్వుకునేలా అనుమతి

  • రూ.71.11 కోట్లు సీనరేజీ పన్ను రద్దు

  • ప్రభుత్వ ఖజానాకు కోత పెట్టిన జగన్‌

  • అప్పటికే తెరవెనుక బెదిరింపులతో కాకినాడ సెజ్‌ మొత్తం అరబిందోకు

  • సీపోర్టులోనూ 41.12% కొట్టేశారు

  • పక్కపక్కనే 2 పోర్టులకు ఒకే యాజమాన్యం ఉండరాదన్న రూల్‌కు బ్రేక్‌

కాకినాడ సీపోర్టులో రూ.2,500 కోట్ల విలువైన 41.12 శాతం వాటాను కేవీ రావు నుంచి బలవంతంగా 494 కోట్లకే లాక్కున్నారు. పక్కనే కాకినాడ సెజ్‌లో 1,104 కోట్ల విలువైన షేర్లకు కేవలం 12 కోట్లే ఇచ్చారు. కేవీ రావు స్వయంగా సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయమిది. ఇక కాకినాడ సెజ్‌లో జీఎమ్మార్‌ను బెదిరించి మరో 51 శాతం వాటా కూడా దక్కించు కున్నారు. ఇలా కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్‌, అందులో నిర్మించబోయే పోర్టు... అన్నీ అరబిందో పరం చేసేశారు.

అంతేకాదు.. కాకినాడ సెజ్‌లో అరబిందో గేట్‌వే పోర్టు నిర్మాణం కోసం ఏకంగా 125 ఎకరాల్లోని కొండను గత జగన్‌ ప్రభుత్వం అడ్డగోలుగా రాసిచ్చేసింది. పదేళ్ల పాటు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా మినహాయింపు ఇచ్చేసింది. తద్వారా అటు బండ రాళ్లు ఉచితం.. ఇటు రూ.71 కోట్ల సీనరేజీ పన్ను రద్దు. అంతా అడ్డగోలు దోపిడీ అన్నమాట. ఈ మొత్తం డీల్‌ వెనుక వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి చక్రం తిప్పారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్‌లో అరబిందో నిర్మిస్తున్న గేట్‌వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్‌ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో ఉన్న కొండను పదేళ్ల పాటు అప్పనంగా రాసిచ్చేశారు. 2023 డిసెంబరు 2 నుంచి 2033 డిసెంబరు వరకు ఉచితంగా కొండను తవ్వుకునేలా అనుమతులు జారీ చేశారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాయల్టీ చెల్లించకుండా మినహాయింపు ఇచ్చింది.


ఇలా అరబిందోకు ఏకంగా 71.11 కోట్లు లబ్ధి కలిగేలా మేళ్లు చేశారు. అన్ని నిబంధనలు గాలికొదిలేసి, అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావును బెదిరించి 41.12 శాతం వాటాను రాయించుకున్న సంగతి తెలిసిందే.అలాగే కాకినాడ సెజ్‌లోని విలువైన భూములనూ అరబిందోకు కట్టబెట్టారు. జగన్‌ సీఎంగా ఉండగానే కాకినాడ సెజ్‌లో పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి స్కెచ్‌ వేశారు. అరబిందో ద్వారా కాకినాడ గేట్‌వే పోర్టుగా ప్రమోట్‌ చేస్తూ 1650 ఎకరాల్లో ఏటా 20 మిలియన్‌ టన్నుల కార్గో సామర్థ్యంతో తొలుత 3 బెర్త్‌లను నిర్మించడానికి పనులు ప్రారంభించారు. పోర్టు నిర్మాణానికి వీలుగా 2023లో తీరం నుంచి సముద్రం మధ్యలో దక్షిణంవైపు 3.24 కిలోమీటర్లు, ఉత్తరం వైపు 0.57 కిలోమీటర్లు బ్రేక్‌వాటర్‌ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని లక్షల టన్నుల రాళ్లు కావాల్సి ఉంది. ఏళ్ల తరబడి భారీ బండరాళ్లను ఈ పోర్టుకు తరలించి బ్రేక్‌ వాటర్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైవీ విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి పోర్టులో డైరెక్టర్‌గా ఉన్న తమ మనిషి మురళీధరన్‌, జగన్‌తో మంతనాలు జరిపారు. అరబిందోకు ఇబ్బంది లేకుండా అతి తక్కువ దూరంలోనే రాళ్ల రవాణాకు వీలుగా ఓ భారీ క్వారీని అన్వేషించారు. 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్న రౌతులపూడి మండలం ములగపూడి గ్రామం సర్వే నంబర్‌1లో ఓ కొండను అరబిందోకు కట్టబెట్టాలని నిర్ణయించారు. అందులోని నల్లరాయి పోర్టు బ్రేక్‌వాటర్‌, బెర్త్‌ల నిర్మాణానికి అనువుగా ఉంటుందని తేల్చారు. అప్పటికప్పుడు కాకినాడ గేట్‌వే పోర్టు తరఫున క్వారీ కేటాయింపునకు లేఖ ఆహ్వానించి, దాని ప్రకారం క్వారీ కట్టబెడుతూ గుట్టుగా జగన్‌ ఆదేశాలు ఇచ్చేశారు. గనుల శాఖ అనుమతులు జారీ చేసింది. పదేళ్ల పాటు ఇందులో రాయి తవ్వి తరలించడానికి సదరు కంపెనీ నిబంధనల ప్రకారం రూ.71.11 కోట్లు రాయల్టీ ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ ఒక్క పైసా కూడా అరబిందో చెల్లించకుండా జగన్‌ రాయల్టీ మినహాయింపు ఇచ్చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి పైసా కూడా కట్టకుండా పోర్టు కోసం యథేచ్ఛగా బండరాళ్లను పెద్దఎత్తున తరలించుకుపోతోంది.


  • జీఎమ్మార్‌ను బెదిరించి...

పదివేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాకినాడ సెజ్‌ దేశంలోనే అతి పెద్దది. ఇందులో 51 శాతం జీఎమ్మార్‌ సంస్థకు, కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టు నిర్వహణదారుడు కేవీరావుకు 0.29 శాతం, ఆయనకే చెందిన కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(కేఐహెచ్‌పీఎల్‌)కు 33.75 శాతం, వేద ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 14.70 శాతం చొప్పున వాటాలు ఉండేవి. ఇది కాకుండా 0.26 శాతం వాటా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనే నాన్‌బ్యాంకింగ్‌ సంస్థకు ఉంది. ఈ సెజ్‌లో ప్రధాన వాటాదారు జీఎమ్మార్‌ సంస్థ భవిష్యత్తులో సెజ్‌లో రాబోయే చమురు, గ్యాస్‌ సంస్థలు, ఆయిల్‌ రిఫైనరీల ఎగుమతి, దిగుమతి అవసరాల కోసం తొండంగి మండలం కోన తీర ప్రాంతంలో రూ.2,300 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ ఓడరేవు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు 2018 నవంబరు 21న అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 2019లో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు కాకినాడకు వచ్చి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పోర్టు నిర్మాణం కోసం కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా జీఎమ్మార్‌ తెచ్చుకుంది. పోర్టు నిర్మాణానికి నిఽధుల సమస్య ఉండడంతో 2019 మార్చిలో అదానీతో జట్టు కట్టింది. ఓడరేవు నిర్మాణంలో 49 శాతం వాటాను అదానీకి కట్టబెడుతూ జీఎంఆర్‌ డీల్‌ కుదుర్చుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కథ మారిపోయింది. తెరవెనుక అనేక బెదిరింపులు జరిగాయి. సెజ్‌ను, అందులో నిర్మించబోయే పోర్టును విక్రయించే ఆలోచనే లేని జీఎమ్మార్‌ ఈ రెండింటినీ అరబిందోకు 2020లో విక్రయించేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్టును రద్దు చేస్తామన్న బెదిరింపుతో జీఎమ్మార్‌ను దారికి తెచ్చుకున్నారు. దీంతో అరబిందో రియాల్టీకి సెజ్‌, ఓడరేవు అనుమతులతో సహా మొత్తం 51 శాతం వాటాను జీఎమ్మార్‌ రూ.2,610 కోట్లకు విక్రయించింది. అప్పటివరకు ఫార్మా రంగంలో ఉన్న అరబిందో సెజ్‌ను, అందులో పోర్టును కొంటుందనే ఊహేలేదు.


మొత్తం అరబిందోకు: కాకినాడ సెజ్‌లో జీఎమ్మార్‌ నుంచి 51 శాతం దక్కించుకున్న తర్వాత మిగిలిన వాటాపైనా జగన్‌ బ్యాచ్‌ కన్నేసింది. కేవీరావుకు ఉన్న 0.29%, ఆయన కంపెనీ కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఐహెచ్‌పీఎల్‌)కు ఉన్న 33.75 శాతం, వేద ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఉన్న 14.70% సెజ్‌ వాటాలు కూడా అతి తక్కువ వ్యవధిలో అరబిందో చేతికి వచ్చేశాయి. ఇలా కాకినాడ సెజ్‌ మొత్తం, అందులో నిర్మించబోయే పోర్టు అరబిందో పరమైపోయాయి. ఇక్కడ బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు కూడా జగన్‌ బ్యాచ్‌ ప్రయత్నించింది. 2020 ఆగస్టులో కేంద్రం ఏపీకి ప్రకటించిన బల్క్‌డ్రగ్‌ పార్కు ఇందులో ఏర్పాటు చేసేలా చక్రం తిప్పారు. ఆ తర్వాత సెజ్‌లో బల్క్‌డ్రగ్‌ పార్కును కేంద్రం రద్దు చేసి విశాఖకు తరలించింది.

  • రూల్స్‌ మార్చేశారు

గత టీడీపీ ప్రభుత్వంలో కాకినాడ సెజ్‌ను జీఎమ్మార్‌ తీసుకున్న సమయంలో అందులో నిర్మించబోయే కొత్త పోర్టు నిర్మాణానికి దరఖాస్తు చేశారు. అప్పటి ప్రభుత్వం 5.13, 5.9 పేరుతో క్లాజులు తీసుకువచ్చింది. అందులోభాగంగా నిర్మించబోయే పోర్టుకు 75 కిలోమీటర్ల పరిధిలో ఇతర ఏ పోర్టులోనూ 25 శాతానికి మించి వాటాలు ఉండకూడదనే నిబంధన విధించింది. రెండు పోర్టులు ఒకే సంస్థ చేతిలో ఉంటే మోనోపోలీకి అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే అరబిందో సంస్థకు కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టులో 41.12 శాతం (కేవీరావు నుంచి లాక్కొన్న) వాటా, అటు సెజ్‌లో నిర్మించనున్న పోర్టులో 100 శాతం వాటా ఉన్న నేపథ్యంలో జగన్‌ సర్కారు ఆ క్లాజులను రద్దు చేసేసింది. రెండు పోర్టులు పక్కపక్కనే ఒకే యాజమాన్యం చేతిలో ఉన్నా అభ్యంతరం లేకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Updated Date - Dec 21 , 2024 | 03:32 AM