Vijayawada: అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరిన రాజధాని రైతులు
ABN , Publish Date - Jun 23 , 2024 | 06:50 AM
అమరావతి: రాజధాని రైతులు ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుంచి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడికి బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో రాజధాని గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకోనున్నారు.
అమరావతి: రాజధాని రైతులు (Amaravati Farmers) ఆదివారం తెల్లవారు జామున విజయవాడ (Vijayawada) కనకదుర్గ (Kanakadurga) అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుంచి మహిళా రైతులు (Women Farmers), రైతులు (Farmers), రైతు కూలీలు (Farmer Labourers) పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడికి బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో రాజధాని గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకోనున్నారు.
పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి రాజధాని రైతులు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి రాజధాని 29 గ్రామాల నుంచి రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. 2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేసిన విషయం తెలిసిందే.
అప్పట్లో రైతులను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ దారి పొడవునా రోడ్డు కడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయించింది. రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయ్ రావు, భారీగా పోలీసులతో మోహరించి.. ఆయనే స్వయంగా లాఠీలతో రైతులపై విరుచుకుపడ్డారు. గాయాలయి, రక్తం కారుతున్నా నాడు రైతులు వెనక్కి తగ్గలేదు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే ఈరోజు అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి బయలుదేరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News