Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్
ABN, Publish Date - Sep 05 , 2024 | 05:59 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆయన కుటుంబ సభ్యులు వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆయన కుటుంబ సభ్యులు వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
ALSO READ: AP Politics: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..
వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్ చేపట్టేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
ALSO READ: AP FLOODS: మళ్లీ పొంగిన బుడమేరు.. రాకపోకలకు అంతరాయం
ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఏకధాటిగా వానలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా విజయవాడలో బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలనూ వరద ముంచెత్తింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. వరద బాధితులకు సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉండి ధైర్యం చెబుతున్నారు.
సహాయక చర్యలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఈరోజు(గురువారం) పలు కాలనీల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సహాయక చర్యలు శరవేగంగా చేపట్టేలా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతునే బాధితుల యోగాక్షేమాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Narayana: రేపే నిత్యవసరాల పంపిణీ.. మంత్రి నారాయణ సమీక్ష
Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..
Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 05 , 2024 | 06:26 PM