ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Rain Alert: బిగ్ అలర్ట్.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్షం పడే ఛాన్స్..!

ABN, Publish Date - Jun 17 , 2024 | 11:08 AM

Weather Upates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో(Andhra Pradesh) భారీగా వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.

AP Rain Alert

Weather Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో(Andhra Pradesh) భారీగా వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనుంది. వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లా సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని తెలిపారు. మంగళవారం, బుధవారం రోజుల్లో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనికి వెళ్లిన వారు, కూలీలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు. ముఖ్యంగా తాటిచెట్ల కింద ఉండకూడదని సూచించారు.


పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విజయవాడ, విశాఖపట్నం సహా అనేక పట్టణాల్లో, జిల్లాల్లో వర్షం కురిసింది. ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా వర్ష సూచన ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షం వలన ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 17 , 2024 | 11:08 AM

Advertising
Advertising