ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్నట్లుగా సీఎం ఢిల్లీ టూర్‌లు

ABN, Publish Date - Jul 17 , 2024 | 03:56 PM

Andhrapradesh: ‘‘అయిననూ పోయి రావలె హస్తినకు’’ అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన తమరు..ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు అని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి …

APCC Chief YS Sharmila Reddy

అమరావతి, జూలై 17: ‘‘అయిననూ పోయి రావలె హస్తినకు’’ అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila Reddy) ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన తమరు..ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు అని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి … బీజేపీ (BJP) పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని నిలదీశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో (PM Modi) గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారని ఏపీసీసీ చీఫ్ అడిగారు.

KTR: సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: కేటీఆర్


అదే బీజేపీ సిద్ధాంతం

‘‘గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా ? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా ? పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత ఇచ్చారా ? రాజధాని నిర్మాణం పై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా ? “ఒడ్డు దాటేదాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. దాట‌క బోడి మ‌ల్ల‌న్న “. ఇదే బీజేపీ సిద్ధాంతం. బాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచింది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది’’ అంటూ వైఎస్ షర్మిల హితవుపలికారు.

Viral: భార్య ట్యాబ్ ఓపెన్ చేసిన భర్తకు దిమ్మదిరిగే షాక్.. అందులో ఫొటోలు చూసి భర్త తీసుకున్న నిర్ణయం ఏంటంటే..!


బాబు ఢిల్లీ టూర్...

కాగా...మరోసారి హస్తినకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు.. కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రమంత్రికి వివరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని వెల్లడించారు. అస్తవ్యస్థ నిర్వహణ, అవినీతి కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని అమిత్‌షాకు బాబు తెలియజేశారు. అనంతరం సీఎం అధికారిక నివాసం (1, జన్‌పథ్)లో పూజలు నిర్వహించి విజయవాడకు తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కే. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

Lanka Dinakar: భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన

Nitin Gadkari: ఏపీ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి సమీక్ష..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 04:10 PM

Advertising
Advertising
<