ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CH baburao: వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం

ABN, Publish Date - Oct 06 , 2024 | 01:31 PM

వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని సీపీఎం సీనియర్ నేత సీ హెచ్ బాబూరావు ఆరోపించారు, వరదల వల్ల రాష్ట్రంలో పదకొండున్నర లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడ: వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని సీపీఎం సీనియర్ నేత సీ హెచ్ బాబూరావు ఆరోపించారు, వరదల వల్ల రాష్ట్రంలో పదకొండున్నర లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ(ఆదివారం) సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.... విజయవాడలో వచ్చిన వరదలకు ప్రకృతీ వైపరిత్యాలతో పాటు మానవ తప్పిదమని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. ఈ విపత్తులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉందని చెప్పారు.


చివరి బాధితుడికి పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని.. ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గత నెల 13వ తేదీకి వరద బాధితులను ఎన్యుమరేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూపై చూపించిన ఆసక్తి, శ్రద్ధ వరద బాధితుల సహాయంపై పెడితే బాగుండేదని చెప్పారు.దీక్షలు కాదు.. కేంద్రంతో మాట్లాడి పరిహారం త్వరగా అందేలా చూడాలని సూచించారు. వరద సహాయం పెంచాలి.. బాధితులు అందరికీ ఇవ్వాలని కోరారు. పునరావాస కాలనీలు వరదలో ఎక్కువ ముంపునకు గురయ్యాయని అన్నారు.


వరద బాధితులకు సహాయం అందజేయడంలో సీఎం చంద్రబాబు శ్రద్ధ చూపించాలని అన్నారు. రూ. 500 కోట్లు దాతలు సహాయం అందించారని ఆ డబ్బులను ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర సహాయం అంశంలో రాష్ట్ర నేతలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వరద బాధితుల సమస్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం అవుతున్నామని హెచ్చరించారు.దరఖాస్తు పెట్టుకున్న వారే కాకుండా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ చేయాలని కోరారు.


విజయవాడలోని కూటమి ప్రజా ప్రతినిధులు వరద బాధితులను ఆదుకోవడంలో ఘోర వైఫల్యం చెందారని మండిపడ్డారు. వరద బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని ధ్వజమెత్తారు. వరద బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ఇంటికి రూ. 5లక్షలు ఇవ్వాలని కోరారు. వరదల్లో ఉన్న వారికి కరెంట్ బిల్లు కట్టాలని చెబుతున్నారని.. వారు ఆపదలో ఉన్నారని.. కరెంట్ బిల్లు ఇంకా కొన్ని రోజుల వరకు అడగకుండా ఉండాలని అన్నారు. ఇంటి పన్ను రద్దు చేయాలని కోరారు.


వరద తగ్గింది.. జ్వరాలు పెరుగుతున్నాయి.. మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్యుమరేషన్ కోసం మళ్లీ అధికారులు, మంత్రులను కేటాయించి సర్వే చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్షం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వరద బాధితులకు నష్ట పరిహారం రూ. 50వేలకు పెంచాలని కోరారు. తక్షణ చర్యలతో పాటు శాశ్వత చర్యలపై దృష్టి పెట్టాలని బాబూరావు కోరారు.

Updated Date - Oct 06 , 2024 | 01:32 PM