TDP: విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్..
ABN, Publish Date - Jun 13 , 2024 | 11:23 AM
విజయవాడ: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: వైసీపీ నేత (YCP Leader) విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)పై టీడీపీ నేత (TDP Leader) బుద్దా వెంకన్న (Buddha Venkanna) ఫైర్ (Fire) అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ (Jagan), విజయసాయి రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొడాలి నాని (Kodali Nani, Vamshi) వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ (Nara Lokesh) నిర్వహించిన జూమ్ మీటింగ్ (Zoom Meeting)లోకి వాళ్లు వస్తే తప్పు అని అని ఎందుకు చెప్పలేదన్నారు. దాడులు చేయవద్దని మా నాయకులు ముందే చెప్పారన్నారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఐదేళ్లల్లో విజయసాయి.. జగన్.. వైసీపీ శ్రేణుల నోళ్లు ఎందుకు అదుపు చేయలేదు..? ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారంటూ బుద్దా వెంకన్న పైర్ అయ్యారు. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర దోచేశారని, వాటిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిజంగా మేము దాడులు చేయాలని అనుకుంటే... ఇలా ఉంటుందా పరిస్థితి? అని ప్రశ్నించారు. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని తమ అధినేత చంద్రబాబు ప్రకటించారని, జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశారా? అని నిలదీశారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగిందని, దానిని డైవర్ట్ చేయడానికే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని, సింహాలు, పులులు అన్న వాళ్లు... అధికారం పోగానే పిల్లులు అయిపోయారా? అని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన దేవినేని అవినాష్‌కు గన్ మెన్లు ఇచ్చారని, బూతులు తిట్టే నానీ, వంశీకి భద్రత పెంచారని విమర్శించారు. వల్లభనేని వంశీ అయితే మాట్లాడకూడని వ్యాఖ్యలు చేశారని, అతనిని మాత్రం వదిలే ప్రసక్తే లేదని.. శిక్ష పడాల్సిందేనని అన్నారు. అధికార మదంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్యామలీ విషయంలో జోక్యం చేసుకుని వాళ్లను తిట్టించారని..అప్పుడు మీకు వాళ్ల బాధ తెలియలేదా?... అప్పుడు చట్టాలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి ముసలి నక్కని.. ఇక నక్క వేషాలు మానుకోవాలని బద్దా వెంకన్న హితవు పలికారు. ఈ ఐదేళ్లు తాము ధైర్యంగా పోరాడి నిలబడ్డామని, అసెంబ్లీలో చంద్రబాబు సవాల్ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక సభలో అడుగు పెడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చింది... జగన్‌కు అదీ కూడా లేదని ఎద్దేవా చేశారు. విజయసాయి రెడ్డి మాయ మాటలు ఎవ్వరూ నమ్మరని అన్నారు. వైసీపీ ఆగలడాలను ఐదేళ్లు భరించామని, కేసులకు భయపడకుండా పోరాటాలు చేశామన్నారు. ఐదు రోజుల్లోనే ఫిర్యాదులంటూ హడావుడి చేస్తున్నారని, అధికార మదంతో అడ్డగోలుగా వాగిన వారు తప్పకుండా శిక్ష అనుభవించాలని బుద్దా వెంకన్న అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలు పేదలకు పంచుతాం
రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
పెన్షన్ పెంపు దిశగా చంద్రబాబు చర్యలు..
చంద్రబాబు కేబినెట్ కూర్పుపై వీహెచ్ ప్రశంసలు
పరదాలు కట్టొద్దని చెప్పానుగా..: లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 13 , 2024 | 11:26 AM