CM Chandrababu: బాధితుడి సమస్య విని ముందుకొచ్చిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 24 , 2024 | 08:27 PM
విజయవాడ వరదలకు బ్యాక్టీరియా వల్ల కాలు కోల్పోయిన బాధితుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక సాయం అందజేసి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. రూ. 10 లక్షల ఎల్‌ఓసీ ఇస్తూ లేఖ విడుదల చేశారు. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో వరదల వల్ల వచ్చిన బాక్టీరియాతో బాధితుడు ఒక కాలు కోల్పోయాడు.
అమరావతి: ఏపీలో గత నెలలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కుండపోతగా పడటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహించింది. బుడమేరు వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగాయి. దీంతో పలువురు బాధితులు సర్వసం కోల్పోయారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టడంతో కొంతమేరకు నష్టం తగ్గింది. అయితే వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆపన్నహస్తం అందిస్తున్నారు.
ALSO READ: AP GOVT: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ధాన్యం కొనుగోలుపై కీలక ప్రకటన
విజయవాడ వరదలకు బ్యాక్టీరియా వల్ల కాలు కోల్పోయిన బాధితుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక సాయం అందజేసి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. రూ. 10 లక్షల ఎల్‌ఓసీ ఇస్తూ లేఖ విడుదల చేశారు. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో వరదల వల్ల వచ్చిన బాక్టీరియాతో బాధితుడు ఒక కాలు కోల్పోయాడు. రెండో కాలికి కూడా ఇదే లక్షణాలు ఉండటంతో ప్రత్యేక చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం చంద్రబాబు దృష్టికి బాధితుడి సమస్యను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తీసుకు వెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు రూ. 10 లక్షల వరకు వైద్యం అందించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు సీఎంఓ అధికారులు లేఖ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం చేయడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
వరద బాధితులకు సాయం..
అమరావతి: భారీ వర్షాలు, వరద బాధితులకు అందజేసే సాయంపై ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తైయింది. ఏపీ వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి కూటమి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. .విజయవాడ పరిధిలోనే సుమారు లక్షన్నర మంది బాధితులు ముంపు బారిన పడ్డారు. బాధితులకు సాయం కింద అందించే ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది.
డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది.ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్సుకు కంటే మించిన స్థాయిలో ఏపీ ప్రభుత్వం సాయం అందజేస్తోంది.ముంపు ప్రాంతాల్లో రూ 180 కోట్ల మేర బ్యాంక్ రుణాల రీ-షెడ్యూల్ చేయనుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియలో బాధితులు ఎవరైనా మిస్ అయితే నిబంధనల ప్రకారం వారికీ ఆర్థిక ప్యాకేజీ అందించాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు సాయం అందజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Konakalla Narayana Rao: సీఎం సముచిత స్థానం కల్పించారు
Ganta: అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ.. పాల్గొన్న గంటా
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 24 , 2024 | 08:37 PM