ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: ఇక అమరావతిపై ఫోకస్.. రాజధానిలో పర్యటించనున్న సీఎం..

ABN, Publish Date - Jun 19 , 2024 | 05:20 PM

ఐదేళ్లపాటు పడావుపడిన అమరావతికి(Amaravati) మళ్లీ పునర్వైభవం రానుంది. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) గురువారం నాడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు.

CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 19: ఐదేళ్లపాటు పడావుపడిన అమరావతికి(Amaravati) మళ్లీ పునర్వైభవం రానుంది. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) గురువారం నాడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలో నాటి వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Also Read: బాబోయ్ ఇలా దోచేశారా? వెలుగు చూస్తున్న వైసీపీ అక్రమాలు..!


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సిడీయాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టిన సైట్‌లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు.

Also Read: ఐఏఎస్ అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలి సమీక్ష..


జగన్ పాలనలో విధ్వంసం..

వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి.. భవనాలను పడావుబెట్టారు. 70, 80 శాతం నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించి.. నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 19 , 2024 | 06:33 PM

Advertising
Advertising