ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Floods: వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా సీఎం చంద్రబాబు, మంత్రుల పర్యటన

ABN, Publish Date - Sep 03 , 2024 | 09:25 PM

నాలుగున్నర గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీల ద్వారా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. భవానీపురం నుంచి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద బాధితులకు ధైర్యం చెబుతున్నారు. మంత్రులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు.

నాలుగున్నర గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఈరోజు(మంగళవారం) విస్తృతంగా పర్యటించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీల ద్వారా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. భవానీపురం నుంచి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద బాధిత ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు. దాదాపు 22 కి.మీ మేర జేసీబీపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు.


మంత్రి టీజీ భ‌ర‌త్ విరాళం

క‌ర్నూలు: వ‌ర‌దల‌ నుంచి ప్రజల‌ను ర‌క్షించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ తెలిపారు. టీజీవీ సంస్థల నుంచి ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్షల విరాళాన్ని అందజేసినట్లు మంత్రి టీజీ భ‌ర‌త్ ప్రకటించారు. ఏపీని ఆదుకునేందుకు అంద‌రూ తోచినంత స‌హాయం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సంక్షోభ స‌మ‌యాల్లో చిన్న, పెద్ద స‌హాయ‌మైనా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని మంత్రి టీజీ భ‌ర‌త్ వెల్లడించారు.


వరద బాధితులకు కేంద్రం సాయం చేస్తుంది: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

తూర్పుగోదావరిజిల్లా: ఏపీలో వరద పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద పరిస్థితులను మోదీ, అమిత్ షాల దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో వరద ముంపు సంభవించిందని అన్నారు. ఏపీను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు.


ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి దుర్గేష్

విజయవాడ: విజయవాడ ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. మైత్రి నగర్, జయప్రకాష్ నగర్, సున్నంబట్టీలు క్రీస్తురాజపురం, అరుణ్ నగర్, గంగిరెద్దుల దిబ్బ ప్రదేశాల్లో సహాయక చర్యల్లో మంత్రి పాల్గొన్నారు. ఉదయం నుంచి బాధితులకు సాయం అందించే కార్యక్రమంలో మంత్రి దుర్గెష్ బిజీ బిజీగా ఉన్నారు. ముంపు బాధితులకు అందుతున్న భోజనం, తాగునీరు, పాలు ఎలా అందుతున్నాయో అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి విపత్తుల గురించి ముందస్తు కార్యాచరణతో ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే నేడు ఈ పరిస్థితికి ప్రధాన కారణమని చెప్పారు. గతంలో ఎన్నాడూ విజయవాడ ఈ రకంగా ముంపునకు గురికావడం చూడలేదని చెప్పారు. ముంపు బారిన పడిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకుంటుందని ఖ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.

Updated Date - Sep 03 , 2024 | 09:39 PM

Advertising
Advertising