AP Politics: నేను బతికి ఉన్నది వారివల్లే.. టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 04 , 2024 | 09:25 PM
మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి రెండో వారంలో తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు.
విజయవాడ: మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి రెండో వారంలో తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనపై దాడులు చేశారని.. చంపాలని కూడా చూశారని.. ఈనాడు బతికి ఉన్నానంటే అధినేత చంద్రబాబు, కార్యకర్తల బలమే కారణమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలవడానికి వంద కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని హెచ్చరించారు. 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచానని తెలిపారు. 2014లో ఆగర్భ శత్రువుల దగ్గరికి పంపించినా పార్టీ కోసం జైలు దగ్గరకు వెళ్లి కలిశానని అన్నారు. కేశినేని నాని, వసంత కృష్ణ ప్రసాద్, సుజనా చౌదరిలు తలా ఒక పార్టీలో ఉంటూ అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని విమర్శించారు.ఏ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ల పనులు చేయించుకుంటున్నారన్నారు. మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరన్నారు. ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా.. లేదా చింతలపూడి కాలువల మీదైనా పడుకుంటానని అన్నారు. టీడీపీ- తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తథ్యమని దేవినేని ఉమా ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - Feb 04 , 2024 | 09:25 PM