ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Perni Nani: పెన్షన్లు పంచడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: మాజీ మంత్రి పేర్ని నాని

ABN, Publish Date - Jul 16 , 2024 | 08:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 35రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

Perni Venkataramaiah

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 35రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఐదేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను దూషించటం, వ్యక్తిత్వ హననం మాత్రమే చేశారని అన్నారు. తనంత అనుభవం దేశంలో ఎవరికీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తుంటారు. మరి ఆ అనుభవంతో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని ప్రశ్నించారు. 35రోజలకు అన్నీ అయిపోతాయని అనలేం, కానీ వారు పెన్షన్లు పంచడం తప్ప మరొకటి చేయలేదని ఆరోపించారు.


శ్వేతపత్రం కాలక్షేపం కోసం మాత్రమే విడుదల చేశారని, అందులో ఎవరినైనా దోషిగా చూపించగలగారా అని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చంద్రబాబు చెప్పడం లేదు, అమరావతి గురించి అడిగినా సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెత్తపై పోరాటం చేసి జగన్‌ని చెత్త ముఖ్యమంత్రి అని తిట్టారు. మరి ఇప్పుడు రోజుకు రూ.3లు వసూలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. మరి ఇప్పుడెందుకు పన్ను వసూలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. జులై 22నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ 11మంది ఎమ్మెల్యేలు హాజరవుతారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Nara Lokesh: గుడ్ న్యూస్.. లెక్చరర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్..!!

MLA Aravinda Babu: కోటప్పకొండ గిరి ప్రదక్షిణ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం

Home Minister Anitha: పోలీసులపై హోంమంత్రి సీరియస్.. కారణమిదే..?

Updated Date - Jul 16 , 2024 | 08:46 PM

Advertising
Advertising
<