Minister Narayana: బుడమేరు గండి పూడ్చేందుకు రంగంలోకి ఆర్మీ: మంత్రి నారాయణ..
ABN, Publish Date - Sep 06 , 2024 | 10:15 AM
బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మరో 48గంటల్లో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
విజయవాడ: బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Ponguru Narayana) తెలిపారు. మరో 48గంటల్లో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ మేరకు భారీ వరదలకు పడిన బుడమేరు గండి పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగినట్లు నారాయణ వెల్లడించారు. మరో 24 గంటల్లో గండి పూడ్చి పరిస్థితి అదుపులోకి తెస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో 24గంటల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు.
మరోవైపు వరద బాధితుల ఆకలి తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వరద బాధితులకు నిత్యావసరాలతో కూడిన ఆహార కిట్లు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. లక్షల కొద్దీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాలకు వారం రోజులుగా బోట్ల సహాయంతో ఆహారం పంపిణీ చేసిన విషయాన్ని మంత్రి నారాయణ గుర్తు చేశారు.
వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు ఆహార ప్యాకెట్లలో పెట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌లో 6 ఆపిల్స్, 6 బిస్కట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉంటాయని వెల్లడించారు. వీటిని ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబానికీ అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. వీటితోపాటు నిత్యావసరాల సరకుల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rain Effect: వరద బీభత్సానికి దెబ్బతిన్న వేలాది కార్లు.. గగ్గోలు పెడుతున్న వాహనదారులు..
Nimmala Ramanayudu: బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టం
AP News: నేటి నుంచి వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి
Updated Date - Sep 06 , 2024 | 10:16 AM