ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: తిరుమల లడ్డూ వివాదం ఎఫెక్ట్.. ఆ ఆలయంలో సరకులు వెనక్కి..

ABN, Publish Date - Oct 06 , 2024 | 05:19 PM

దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. తొమ్మది రోజులపాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు భక్తులు భారీగా వస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఉత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

విజయవాడ: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దేవదాయ, ఆహార భద్రతా శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకు సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత విషయంలో అధికారులు ఎటువంటి రాజీ పడడం లేదు. తిరుమల వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారం నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.


దేవాలయాల్లో నైవేద్యాలకు వినియోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్ మిస్, బెల్లం సహా అన్నప్రసాదానికి సరఫరా చేసే పదార్థాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వారికి అందించే అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి వచ్చే సరకుల్లో ఏమాత్రం లోపం కనిపించినా నిర్మోహమాటంగా వెనక్కి పంపిస్తున్నారు.


దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. తొమ్మది రోజులపాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు భక్తులు భారీగా వస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఉత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అలాగే అన్నప్రసాదం, అమ్మవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడడం లేదు. నాణ్యత సరిగా లేని 200 బాక్సుల కిస్‌మిస్‌లను ఫుడ్‌ సెఫ్టీ, ఆలయ అధికారులు ఇవాళ(ఆదివారం) వెనక్కి పంపారు. దసరా ఉత్సవాల్లో సందర్భంగా కాంట్రాక్టర్ మొదటి రోజు పెద్ద సైజులో ఉండే కిస్‌మిస్‌‌లు సరఫరా చేశారు. అనంతరం నాణ్యత, సైజు తక్కువగా ఉన్న వాటిని పంపడంతో అధికారులు తిరిగి పంపించేశారు. గత 10రోజుల వ్యవధిలో మూడుసార్లు సరకులు వెనక్కి పంపారు.


ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్‌పై ఆలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం నాణ్యమైన పదార్థాలనే సరఫరా చేయాలని హెచ్చరించారు. ఇప్పటికే 10రోజుల్లోనే మూడుసార్లు వెనక్కి పంపామని, నాణ్యమైన వాటినే పంపాలని ఆదేశించారు. లేకుంటే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత పెరిగిందంటూ పలువురు భక్తులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే లడ్డూ చాలా రుచికరంగా ఉందని భక్తులు చెప్తున్నారని సీఎం చంద్రబాబు ఇటీవల తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: పుంగనూరు బాలిక కుటుంబానికి చంద్రబాబు ఫోన్.. వారిని వదిలిపెట్టబోమని హామీ..

Chittoor: పుంగనూరు బాలిక హత్య కేసు.. ముగ్గురి అరెస్టు.. సంచలన విషయాలు వెల్లడి..

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు.. ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 06 , 2024 | 05:26 PM