AP GOVT: వరద నష్టంపై ఆర్పీ సిసోడియా కీలక ఆదేశాలు
ABN, Publish Date - Sep 07 , 2024 | 05:26 PM
న్టీఆర్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైందని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లాలో 21 సెంటిమీటర్ల పడాల్సి ఉండగా 34.5 సెం.మీ. వర్షం పడిందని చెప్పారు. ఏడు జిల్లాలో వర్షాలు బాగా కురిశాయని అన్నారు.
తాడేపల్లి : ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైందని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లాలో 21 సెంటిమీటర్ల పడాల్సి ఉండగా 34.5 సెం.మీ. వర్షం పడిందని చెప్పారు. ఏడు జిల్లాలో వర్షాలు బాగా కురిశాయని అన్నారు. 11.35 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణానదికి వచ్చిందని తెలిపారు. ప్రకాశం బ్యారేజికి పూర్తి కెపాసిటి వరద వచ్చిందని అన్నారు. బుడమేరుకు ఏడు వేల నుంచి 35 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. మూడు గండ్లు పడటంతో విజయవాడ భారీ వర్షాలకు దెబ్బతిందని చెప్పారు. సహాయక చర్యలపై 24/7 అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు కేంద్ర సంస్థలతోనూ సంప్రదిస్తున్నామని తెలిపారు.
రిలీఫ్ కేంద్రాలకు 45 వేలమందిని తరలించామని అన్నారు. 32 జేసీబీలు పెట్టామని, డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు. 21 మందిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించామని అన్నారు. లక్ష 30వేలకు పైగా ఫుడ్ ప్యాకెట్లను బాధితులకు డ్రోన్ల ద్వారా అందించామని వివరించారు. ఇప్పటి వరకు భారీ వర్షాల కారణంగా ఏపీలో 43 మంది చనిపోయారని అన్నారు. 1.3 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్‌బీ రోడ్లకు భారీగా గండ్లు పడ్డాయని తెలిపారు. బుడమేరు గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూడ్చారని గుర్తుచేశారు.
సింగ్ నగర్ ఇంకా వరదలోనే ఉందని అన్నారు. ఒక యాప్ ద్వారా నష్టాలను అంచనాలు వేస్తామని తెలిపారు. తొమ్మిది నుంచి మూడు రోజులు నష్టం అంచనాలు వేస్తామని తెలిపారు. ఆరోజు ఇంటి యజమాని కచ్చితంగా ఆ ఇంట్లోనే ఉండాలని సూచించారు. వరదలతో చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లారని తెలిపారు. కానీ తొమ్మిది నుంచి మీరు మీ ఇళ్ల దగ్గరే ఉండాలని చెప్పారు. లేకపోతే నష్టం అంచనాలు వేయలేమని అన్నారు. రూ. 6,800 కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్రానికి నివేదిక పంపించినట్లు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా స్వయంగా అంచనాలు వేస్తోందని తెలిపారు. మనం వేసిన అంచనాలు కరెక్టో కాదో వారు కూడా చేస్తారని అన్నారు. ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా పంటనష్టం అందిస్తామని తెలిపారు. బుడమేరుకు గండ్లు పడతాయన్న సంగతి తెలియదని అన్నారు. 35 వేల క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగా తెలుసునని చెప్పారు. కానీ 2 లక్షల కుటుంబాలను తరలించాలంటే సాధ్యం కాదని అన్నారు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయని అన్నారు. గోదావరి జిల్లాలో వరద వస్తుందని చెబితే తమకు తెలుసులే అంటారని.. అలాంటి సమస్యే బుడమేరు దగ్గర ఉందని ఆర్పీ సిసోడియా వెల్లడించారు.
Updated Date - Sep 07 , 2024 | 05:27 PM