IPS: ఆ కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ల కుట్రలు..
ABN, Publish Date - Aug 15 , 2024 | 01:11 PM
Andhrapradesh: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఏఎస్‌లు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు ఆగకుండా వారు అడ్డుపడుతుండడంతో చర్యలు చేపట్టారు.
అమరావతి, ఆగస్టు 15: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు (AP IPS) మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఏఎస్‌లు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు ఆగకుండా వారు అడ్డుపడుతుండడంతో చర్యలు చేపట్టారు. విచారణ చేస్తున్న అధికారులను, సిబ్బందిని వెయిటింగులో ఉన్న ఐపీఎస్ లు పిలిపించుకుని, ఫోన్ లోనూ మాట్లాడుతున్నారని ప్రభుత్వానికి (AP Govt) సమాచారం.
Pawan Kalyan: వారి జోలికి ఎవరొచ్చినా ఊరుకోం
విచారణ సరిగా చేయొద్దని తూతూ మంత్రంగా ముగించాలంటూ వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విచారణలను వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు ప్రభావితం చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం గుర్తించింది. తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల పాత్రను, ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌ల వేడుకున్నట్లు తెలుస్తోంది. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. దర్యాప్తులో ఉన్న కొందరు అధికారులు, సిబ్బందిని ప్రభావితం చేసేలా ఎత్తులు వేసినట్లు తెలియవచ్చింది.
Soy Candles : సోయా క్యాండిల్ ఎంత స్పెషల్ అంటే.. !
వీటిని గుర్తించిన నిఘా విభాగం... ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇచ్చినట్లు సమాచారం. వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌ల తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్న పరిస్థితి. వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్‌లు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. వారితో టచ్‌లో ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల్లోని దర్యాప్తులో అటంకం కల్పించే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ పరిణామాలతో డీజీపీ కార్యాలయం అప్రమత్తమైంది. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులను రోజు వచ్చి హెడ్ క్వార్టర్స్‌లో ఉదయం, సాయంత్రం సంతకాలు చేసి వెళ్ళాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణను ప్రభావితం చేయడం నేరంగా భారతీయ న్యాయ సంహిత పరిగణిస్తోంది. అయినా కూడా వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారులు యదేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: మా ప్రభుత్వంలో రాజకీయ కక్షకు తావులేదు... కానీ
Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం.. ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..!
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 15 , 2024 | 01:30 PM