AP Politics: జగన్‌ను అరెస్ట్ భయం వెంటాడుతోందా..!
ABN, Publish Date - Aug 17 , 2024 | 09:13 AM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగబోమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పార్టీ ఎమ్మెల్యేలకు, క్యాడర్‌కు ఇదే విషయాన్ని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగబోమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పార్టీ ఎమ్మెల్యేలకు, క్యాడర్‌కు ఇదే విషయాన్ని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఏదైనా అవినీతి, అక్రమాలు, అరాచకాలు జరిగిఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని.. అంతేకానీ జగన్ వ్యవహరించినట్లు తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో వ్యవహరించబోదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ భయం వెంటాడుతోందట. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఏపీ కంటే బెంగళూరులోనే ఎక్కువుగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి.. రెండు మూడు రోజులు తాడేపల్లిలో ఉండి.. మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోతున్నారట. ఓవైపు పార్టీ క్యాడర్ మొత్తం ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి నిరాశతో ఉన్నారు. కొందరు నాయకులైతే వైసీపీకి గుడ్‌డై చెప్పేసి.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో అక్రమాలపై తెలుగుదేశం ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహరంలో అరెస్ట్ అయ్యారు. తవ్వేకొద్ది గత వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కబ్జాలు బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే జగన్ సైతం జైలుకెళ్లే పరిస్థితి ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈక్రమంలో జగన్ బెంగళూరులోనే ఎక్కువుగా ఎందుకు ఉంటున్నారనే చర్చ జరుగుతోంది.
పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్!
స్పందించాల్సి వస్తుందనా..!
అగ్రిగోల్డ్ భూముల వ్యవహరంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారు. అలాగే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో దాదాపు రూ.150 కోట్ల అక్రమాలు జరిగాయని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పోలీసు అధికారులను ఆదేశించింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి ఆధారాలతో సహా భయటపడుతున్నవేళ.. ఓపార్టీ అధినేతగా వాటిపై స్పందించాల్సిన బాధ్యత జగన్‌పై ఉంటుంది. కొన్నిరోజుల క్రితం రాష్ట్రంలో జరిగిన ఒకట్రెండు ఘటనలపై స్పందిస్తూ.. ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ ఇప్పుడు ఆ పార్టీ నాయకుల అక్రమాలపై ఎందుకు స్పందించడంలేదనే ప్రశ్న ఎదురవుతుంది. తాడేపల్లిలో ఉంటే తప్పనిసరిగా స్పందిచాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన బెంగళూరులోనే ఎక్కువుగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పోలవరానికి.. త్వరగా నిధులివ్వండి
అప్పుడలా.. ఇప్పుడిలా..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేశారంటూ వచ్చిన ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండిస్తూ వచ్చారు. తాము ఎంతో పారదర్శకంగా వ్యవహరించామని చెప్పుకొచ్చారు. తీరా ప్రభుత్వం మారిన తర్వాత ఆధారాలతో సహా వైసీపీ అక్రమాలను బయటపెడుతుంటే ఆ పార్టీ నాయకులంతా సైలెంట్ అయిపోయారు. దీంతో నిజంగానే అక్రమాలు జరిగిఉంటాయనే చర్చ జోరుగా సాగుతోంది.
మధుసూదన రెడ్డిపై సస్పెన్షన్ వేటు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Aug 17 , 2024 | 09:31 AM