ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budda Venkanna: నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే... తాచుపాము జగన్

ABN, Publish Date - Jul 13 , 2024 | 11:24 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్‌లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.

TDP Leader Budda Venkanna

విజయవాడ, జూలై 13: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (CM Chandrababu Naidu) ఉద్దేశించి వైసీపీ నేతలు (YSRCP Leaders) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్‌లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ‘‘మచిలీపట్నంలో అత్యధిక మెజారిటీతో నిన్ను, నీ కుమారుడిని ఓడించారు. ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే


అందుకే ప్రజలు వైసీపీని తరిమికొట్టారు..

అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మారిస్తే... జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విరుచుకుపడ్డారు. ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని అన్నారు. ఐదు అడుగుల తాచుపాము జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ తాచుపాముకు తన మన బేధం‌ లేదని.. ఎవరినైనా కాటేస్తాడని వ్యాఖ్యలు చేశారు. వైఎస్, జగన్‌లు ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారన్నారు. చివరికి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారన్నారు. దేశం మొత్తం, ఇతర దేశాల్లో స్థిరిపడిన వారంతా బాబుకు మద్దతుగా నిలిచారని తెలిపారు. వైసీపీ చేసిన పిచ్చి పనులకు ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు. ఇంకా అబద్దాలతో ‌ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారన్నారని టీడీపీ నేత మండిపడ్డారు.

Viral Video: వధువు చేయి పట్టుకుని తీసుకొచ్చిన తండ్రి.. కన్నీరు పెట్టుకున్న రాధిక


వైసీపీ నేతల్లారా సిగ్గు తెచ్చుకోండి...

‘‘పేర్ని నాని నీ కపట మాటలు మానుకుని బుద్ధి తెచ్చుకో. గుడివాడ అమర్నాథ్ సాక్షి పత్రికలో వచ్చినవే చెబుతాడు’’ అని విమర్శించారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో మార్పు తెచ్చిన మనిషి చంద్రబాబు అని కొనియాడారు. అధికారులతో సమీక్ష చేసి, శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారన్నారు. జగన్ ఐదేళ్లల్లో ఎప్పుడు అయినా అధికారులతో ఇలా మాట్లాడారా అని ప్రశ్నించారు. కమీషన్‌లు, కాంట్రాక్టులలో మామూళ్ల కోసం జగన్ మీటింగ్‌లు పెట్టారన్నారు. వైసీపీ నాయకుల్లారా సిగ్గు తెచ్చుకోండి... లేదంటే జనం తమిమి కొడతారని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

Chandrababu: ప్రపంచాన్ని నడిపించేది మనకి తెలియని శక్తి.. అదే లేకుంటే..


ముసలి వాడు, చేవ, సత్తువ లేని వ్యక్తి జగన్...

వైసీపీలో జగన్ నుంచి కిందిస్థాయి వరకు అందరు కూడా పదవీ కాంక్షతో బతుకుతున్నారన్నారు. బీపీసీఎల్ నేడు చంద్రబాబుపై నమ్మకంతో ముందుకు వచ్చిందన్నారు. జగన్‌ను చూసి పారిశ్రామికవేత్తలు‌ భయంతో వెళ్లిపోయారన్నారు. ‘‘కియా, అమర్ రాజా కంపెనీ విషయంలో వాటాలు అడగలేదా? వైసీపీ ‌వేధింపుల వల్లేగా వాల్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయింది.. అడగలేదా మీరు? గుడివాడ అమర్నాథ్, పేర్ని నానిలకు మైండ్ పోయింది. పవన్ కళ్యాణ్‌పై (Deputy CM Pawan Kalyan) నోరు పారేసుకుని మీ కులం వాళ్లతో ఛీ కొట్టించుకున్నారు. మా సీఎం సంయమనం పాటించాలని మమ్మలను ఆపారు. మీరు ఇంకోసారి అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబితాం. చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేస్తారు. నెల రోజుల్లో అన్నీ అయిపోవడం సాధ్యమా? మీ జగన్ ఇదే నెల రోజుల్లో పదవులు పంచుకునే పనిలో ఉన్నాడు. చంద్రబాబు ఢిల్లీ‌వెళ్లి నిధుల కోసం కృషి చేస్తున్నారు. మీరు చేసిన అప్పులు, తప్పులు సరి చేయడానికి చంద్రబాబు కష్ట పడుతున్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తారు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. 74 యేళ్ల వయసులో 24 ఏళ్ల కుర్రాడిలా చంద్రబాబు పరుగులు పెడుతున్నారు. ముసలి వాడు అంటున్న మీరు ముందు మీ జగన్ ఎప్పుడు బయటకి వచ్చాడో చెప్పండి. నిజమైన ముసలి వాడు, చేవ, సత్తువ లేని వ్యక్తి జగన్. మీ పార్టీలో నాయకులు మైండ్ పోయి నోటికొచ్చిన విధంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని వాగితే ... రోడ్ల మీద తిరగలేరు. మీ రాక్షస పాలన తట్టుకోలేకే మళ్లీ చంద్రబాబు కావాలని‌ ప్రజలు గెలిపించారు. నెల రోజులకే గుండెలు బాదుకుంటే ఎలా?... త్వరలోనే సుపారిపాలన ఎలా ఉంటుందో చంద్రబాబు చేతల్లో చూపిస్తారు’’ అంటూ బుద్దా వెంకన్న పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

YS Jagan: జగన్‌పై హత్యాయత్నం కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 12:00 PM

Advertising
Advertising
<