ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: వైసీపీ నేత అరాచకం.. సంచలనంగా మారిన భూకబ్జా వ్యవహారం..

ABN, Publish Date - Nov 13 , 2024 | 05:26 PM

విజయవాడలో ఉమామహేశ్వరశాస్త్రి అనే వ్యక్తికి విలువైన స్థలం ఉంది. దానిపై వైసీపీ రాష్ట్రస్థాయి నేత గౌతమ్ రెడ్డి కన్నుపడింది. దీంతో అతని స్థలం కబ్జా చేసి బెదిరింపులకు దిగాడు గౌతమ్ రెడ్డి. స్థలం తనకు ఇచ్చేయాలని, లేకుంటే ప్రాణాలు తీస్తానని పలుమార్లు హెచ్చరించాడు.

అమరావతి: విజయవాడ (Vijayawada) నగరంలో భూ కబ్జా వ్యవహారంలో ఓ వైసీపీ (YSRCP) నేత అడ్డంగా బుక్కయ్యాడు. స్థల యజమానిపై హత్యాయత్నం చేసేందుకు సుపారీ ఇచ్చి రౌడీలను కేటాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు గుర్తించారు. ఆ వైసీపీ నేత పరారీలో ఉండగా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

AP News అంబటి ఆఫీసులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్


విజయవాడలో ఉమామహేశ్వరశాస్త్రి అనే వ్యక్తికి విలువైన స్థలం ఉంది. దానిపై వైసీపీ రాష్ట్రస్థాయి నేత గౌతమ్ రెడ్డి కన్నుపడింది. దీంతో అతని స్థలం కబ్జా చేసి బెదిరింపులకు దిగాడు గౌతమ్ రెడ్డి. స్థలం తనకు ఇచ్చేయాలని, లేకుంటే ప్రాణాలు తీస్తానని పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఎంత బెదిరించినా బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి మాత్రం తన భూమిని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో అతనిపై హత్యాయత్నం చేసేందుకు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి నిశ్చయించుకున్నాడు. అనంతరం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన గ్యాంగ్‌కు రూ.24 లక్షలు సుపారీ ఇచ్చాడు. స్థల యజమాని కాళ్లు, చేతులు విరిచేయాలని వారికి చెప్పాడు. విషయం తెలుసుకున్న బాధితుడు ఈనెల 6న విజయవాడ సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ నేత వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు.

Rajamahendravam: సినీ నటి శ్రీరెడ్డికి మరో షాక్.. ఆమెపై కేసు నమోదు.. ఎందుకంటే..


అయితే గౌతమ్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో సుపారీ విషయాన్ని గుర్తించారు. గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చిన విషయం నిజమేనని తేల్చారు. గ్యాంగ్‌కు సుపారీ ఇస్తుండగా రికార్డయిన సీసీ టీవీ ఫుటేజ్‌ని సేకరించారు. దాడి చేసేందుకు ఒప్పందం చేసుకున్న నలుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు. అయితే గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయడంతో అప్రమత్తమైన గౌతమ్ రెడ్డి పరారయ్యాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు విజయవాడ సీపీ రాజశేఖర బాబు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాలనూ జల్లెడపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

TEA: బీ కేర్ ఫుల్... టీ ఇన్ని కప్పులు తాగితే ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు..

KTR: పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

Read latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 05:27 PM