ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వంశీ అనుచరులే రెచ్చగొట్టారు: యార్లగడ్డ వెంకట్రావు

ABN, Publish Date - Jun 07 , 2024 | 09:50 PM

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ {Vallabhaneni Vamsimohan) నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) స్పందించారు.

విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ {Vallabhaneni Vamsimohan) నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) స్పందించారు. టీడీపీ కార్యకర్తలను వంశీ మనుషులే రెచ్చ గొట్టారని.. ఇదేంటని అడగటానికి ఆ రోడ్డులోకి వెళ్లారని చెప్పారు.


వంశీ అనుచరులు తమ పార్టీ కార్యకర్తలను బూతులు తిట్టడం వల్లే ఈ ఘర్షణ ప్రారంభమైందన్నారు. ఇరు వర్గాలను పంపించాల్సిన పోలీసులు తమ వాళ్లను కొట్టారని మండిపడ్డారు.సీఆర్పీఎఫ్ బలగాలతో లాఠీ‌ఛార్జి చేయించారని ధ్వజమెత్తారు.ఈ దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయని అన్నారు.వారిని ఆస్పత్రికి తరలించకుండా స్టేషన్‌లో ఉంచారని అన్నారు. మాచవరం పీఎస్‌లో ముగ్గురు ఉంటే తాను వెళ్లి వారిని ఆస్పత్రిలో చేర్చానని అన్నారు.


ఇంకా ఐదుగురి ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. వారిని 9 గంటల కల్లా వదలకపోతే తాను ఆందోళనకు దిగుతానని అన్నారు.పోలీసులు తీరును చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కొంతమంది పోలీసులు ఇంకా వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఫైర్ అయ్యారు.వాళ్లు ఇచ్చిన డబ్బులకు న్యాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కొంతమంది ఏసీపీలు వంశీ మంచోడని కితాబిస్తున్నారని.. వాళ్ల మనుషులకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారా అని నిలదీశారు. తమ వాళ్లను వెంటనే వదిలేయాలని.. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు.

Updated Date - Jun 07 , 2024 | 09:50 PM

Advertising
Advertising