YS Sharmila: చంద్రబాబు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలి.. కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలి
ABN, Publish Date - Sep 10 , 2024 | 04:40 PM
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలని.. కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో ఈరోజు(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలని.. కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో ఈరోజు(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు. వరద బాధితులను పరామర్శించి, వస్త్రాలను షర్మిల పంపిణీ చేశారు.
కేంద్ర సహాయం ఏదీ..
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... విజయవాడలో వరద. బీభత్సం అందరం చూశామని అన్నారు. బుడమేరు ముంపుతో ఏడు లక్షల మంది ప్రభావితం అయ్యారని చెప్పారు. 50 మంది వరదలతో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అపారమైన ఆస్తి నష్టంతో ప్రజలు దెబ్బతిన్నారని అన్నారు. విజయవాడకు సమీపంలోనే రాజధాని అమరావతి ఉందని చెప్పారు. ఒక్క విజయవాడలో ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోందని షర్మిల ప్రశ్నించారు. రూ. 6, 888 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. కేంద్ర బృందాలు ఏపీకి వచ్చి, చూసి పరిశీలించి వెళ్లాయని.. మరీ సాయం ఎందుకు చేయలేదని షర్మిల ప్రశ్నించారు.. ఏపీపై కేంద్ర ప్రభుత్వానికి అంత చిన్న చూపు ఎందుకని షర్మిల నిలదీశారు.
ALSO READ:Narayana: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
ఏపీకి ప్రధాని మోదీ ఎందుకు రావట్లేదు...
ఏపీ నుంచి ఎంపీలను గెలిపిస్తేనే బీజేపీ అధికారంలో ఉందన్న విషయం మరిచిపోకూడదని తెలిపారు. ప్రధాని మోదీ ఎక్కడెక్కడో తిరుగుతారని.. ఏపీకి ఎందుకు రావడం లేదని షర్మిల నిలదీశారు. అధికారం ఇచ్చిన ఏపీపై మోదీకి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉండటంతో ఏపీకి ఒరిగిందేమీ లేదని షర్మిల విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ఈ విషయంపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తాము కేంద్రానికి రాష్ట్ర సమస్యలపై లేఖ రాశామని షర్మిల గుర్తుచేశారు.
రేషన్ బియ్యం ఎలా తింటారు..
ఆంధ్రప్రదేశ్‌లో గుక్కెడు మంచి నీళ్లు కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు వింటే ఆవేదన కలుగుతోందని వాపోయారు. భారీ వర్షాలకు ఇంట్లో సామాన్లు కూడా ఒక్కటీ మిగల్లేదని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయని అన్నారు. బాధితులకు రేషన్ బియ్యం ఇచ్చారని... అవి ఎలా తింటారని ప్రశ్నించారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని షర్మిల నిలదీశారు. రైల్వే శాఖ మంత్రికి లేఖ రాసినా ఎందుకు స్పందన లేదని షర్మిల అడిగారు.
రైల్వేశాఖ పట్టించుకోదా..
రైళ్లకు నీటిని విజయవాడలోనే నింపుతారని తెలిపారు. రూ. 6వేల కోట్ల ఆదాయం ఇచ్చే రైల్వేకు ప్రజల పట్ల బాధ్యత లేదా అని షర్మిల నిలదీశారు. ఏపీ ప్రజల సమస్యలు పట్టించుకోని బీజేపీతో ఉండటం ఏపీకి ఏం అవసరమో చంద్రబాబు ఆలోచించాలని అన్నారు. బుడమేరు ముంపు తప్పు మీదంటే మీదని వైసీపీ, టీడీపీ విమర్శలు చేసుకుంటున్నాయని షర్మిల ఆక్షేపించారు.
ALSO READ: Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..
వైఎస్ హయాంలో ‘ఆపరేషన్ కొల్లేరు’
గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘ఆపరేషన్ కొల్లేరు’ చేపట్టి కొంతమేర పనులు పూర్తి చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఆక్రమణలను ప్రోత్సహించారని ఆరోపించారు. కనీసం కాల్వలకు చేయాల్సిన మరమ్మతులు కూడా ఎందుకు చేయలేదని నిలదీశారు. బుడమేరు ముంపునకు అందరూ కారకులేనని విమర్శలు చేశారు. ప్రజల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ఆక్రమణలు పూర్తిగా తొలగించి చర్యలు తీసుకోవాలని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం అందజేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
బాధితులకు లక్ష రూపాయల సాయం చేయాలి..
ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలకు ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు బాధితులకు వెంటనే లక్ష రూపాయల సాయం చేసి ఆదుకోవాలని కోరారు. కనీసం రూ. 15, 000 వేలు ఇప్పుడు ముందస్తుగా సాయం చేయాలని అన్నారు. పంట నష్టం కూడా అంచనా వేసి రైతులను ఆదుకోవాలని షర్మిల కోరారు.
మోదీ నుంచి చంద్రబాబు రూ. 10 వేల కోట్లు తేవాలి..
మారుమూల ప్రాంతాలకు సహాయం అందేలా చూడాలని అన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోడం కాదని.. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బులు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోదీని ఈ విషయంలో నిలదీయాలని అన్నారు. పిల్లల దగ్గర ఎందుకు.. మోదీ నుంచి రూ. 10 వేల కోట్లు సీఎం చంద్రబాబు తేవాలని వైఎస్ షర్మిల కోరారు.
ఈ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..
Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Sep 10 , 2024 | 05:53 PM