ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: అమ్మో సీఎం పర్యటనా!.. హడలెత్తిపోతున్న బనగానపల్లె ప్రజలు

ABN, Publish Date - Mar 14 , 2024 | 09:06 AM

Andhrapradesh: ఈరోజు (గురువారం) కర్నూలు, నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అయితే సీఎం పర్యటనతో బనగానపల్లె జనం హడలెత్తిపోతున్నారు.

నంద్యాల, మార్చి 14: ముఖ్యమంత్రి పర్యటన అంటే చాలు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. సీఎం వచ్చే చోటు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల వరకు జనాలను రానీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంటారు పోలీసులు. దుకాణాలను మూసివేయడం, బారికేడ్లు పెట్టడం కామన్‌ అయిపోయింది. ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ను మళ్లిస్తుండటంతో ఆయా రూట్లలో వచ్చే వాహదారుల కష్టాలు మామూలుగా ఉండదు. సీఎం వస్తున్నారంటే చాలు.. అమ్మో ముఖ్యమంత్రి పర్యటననా అంటూ హడలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

AP News: నేడు టీడీపీ రెండో జాబితా!.. ఆశావహుల్లో ఉత్కంఠ!


ఈరోజు (గురువారం) కర్నూలు, నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అయితే సీఎం పర్యటనతో బనగానపల్లె జనం హడలెత్తిపోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో కర్నూలు, నంద్యాల, పులివెందుల, పొద్దుటూరుకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లె బస్టాండ్ నుంచి హెలిప్యాడ్ వరకూ దారి పొడవునా ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలను మూయించి వేశారు. రోడ్డుపై బారికేడ్‌లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్న పరిస్థితి. ఆర్టీసీ, ప్రైవేటు, స్కూళ్ల బస్సుల్లో ముఖ్యమంత్రి సభకు జనాన్ని తరలించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

TS News: నల్లవల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ..

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి


సీఎం పర్యటన షెడ్యూల్..

కర్నూలు జిల్లాలో పర్యటనలో భాగంగా నేషనల్‌ లా యూనివర్శిటీకి సీఎం భూమి పూజ నిర్వహించనున్నారు. అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లుకు జగన్ చేరుకోనున్నారు. అక్కడ నేషనల్‌ లా యూనివర్శిటీకి భూమి పూజ చేసి.. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్నారు. నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి నివాసానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు.

ఇవి కూడా చదవండి..

YCP: ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు

PM Modi: రేపు సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2024 | 10:40 AM

Advertising
Advertising