ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kurnool: పొలం పనులు చేస్తుండగా మెరుస్తూ కనిపించిన రాయి.. ఏంటోనని చూడగా.. వాటే లక్

ABN, Publish Date - Sep 17 , 2024 | 08:15 AM

తుగ్గలి మండలం సూర్యతాండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీ పొలం పనులు చేస్తున్నాడు. ఇంతలో అతని కంటికి ఏదో కనిపించింది. ఏంటా అని పరీక్షపెట్టి చూడగా.. తెల్లగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని గమనించిన అతనికి వజ్రం అని అనుమానం కలిగింది.

కర్నూలు: తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి అదృష్టం కలిసోచ్చింది. ఒక్కసారిగా జాక్ పాట్ తగలడంతో ఆ గిరిజన బిడ్డ ఉబ్బితబ్బిపోతున్నాడు. అసలేం జరిగిందంటే.. తుగ్గలి మండలం సూర్యతాండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీ పొలం పనులు చేస్తున్నాడు. ఇంతలో అతని కంటికి ఏదో కనిపించింది. ఏంటా అని పరీక్షపెట్టి చూడగా.. తెల్లగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని గమనించిన అతనికి వజ్రం అని అనుమానం కలిగింది. తోటి కూలీలు చూసి అది వజ్రమే అని చెప్పడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశాడు.


విషయం ఆనోట, ఈనోట చేరి ప్రచారం జరిగింది. దీంతో వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. దాన్ని పరీక్షించిన వ్యాపారులు 8క్యారెట్ల వజ్రంగా తేల్చారు. తక్కువ ధరకు కొన్నేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే తనకు మంచి ధర ఇస్తేనే అమ్ముతానంటూ రైతు భీష్మించాడు. దీంతో పెరవలికి చెందిన వ్యాపారి రైతు కూలీకి రూ.5లక్షలు ఇచ్చి కొనుగోలు చేశాడు. వజ్రం దొరకడం, ఒక్కసారిగా రూ.5లక్షలు రావడంతో తనంత అదృష్టవంతుడు మరొకరు ఉండరంటూ అతను సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.


కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని ఇటీవల జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్‌ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. దీంతో వజ్రాలు వెతికేందుకు ప్రజలు ఆయా ప్రాంతాలకు తండోపతండాలుగా వెళ్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Jany Master: జానీ మాస్టర్ లవ్ జిహాద్‌.. కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్

మొన్న ఐటీ.. నేడు గ్రీన్‌ ఎనర్జీ!

పదైదు వేల గతం.. మరిచావా జగన్‌?

Updated Date - Sep 17 , 2024 | 01:04 PM

Advertising
Advertising