Share News

గ్రామీణ రోడ్లపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:29 AM

గ్రామీణ రోడ్లుపై కేంద్రానికి మంత్రి బీసీ జనార్దనరెడ్డి ప్రతిపాదనలు అందించినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, వీఅర్‌ లక్ష్మీరెడ్డి గురువారం వెల్లడించారు.

గ్రామీణ రోడ్లపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

కొలిమిగుండ్ల, సెప్టెంబరు 19: గ్రామీణ రోడ్లుపై కేంద్రానికి మంత్రి బీసీ జనార్దనరెడ్డి ప్రతిపాదనలు అందించినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, వీఅర్‌ లక్ష్మీరెడ్డి గురువారం వెల్లడించారు. బనగానపల్లె నియోజకవర్గంలోని పలు గ్రామీణ రోడ్లకు సంబంధించి సెంట్రల్‌ రోడ్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(సీఆర్‌ఐఎఫ్‌) కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్స్‌, ట్రాన్సపోర్ట్‌ మంత్రి నితిన గడ్కరీని కోరారని చెప్పారు. కొలిమిగుండ్ల మండలంలోని పేట్నీకోట - పేరుసోముల వయా మీర్జాపురం రహదారికి సంబంధించి 12.60కి.మీగాను రూ.30కోట్లు, తిమ్మనాయినిపేట - కొలిమిగుండ్ల రహదారి 13.80కి.మీకు రూ.29 కోట్లు, సంజామల-కోవెలకుంట్ల, ముక్కమొల్ల-అవుకు రోడ్డు 11.38కి.మీకు రూ.23 కోట్లు, సంజామల-పేరుసోముల రహదారి 14.20కి.మీకు రూ.29 కోట్లు, పలుకూరు-కొత్తూరు-నందివర్గం రహదారి 10.60కి.మీకు రూ.22 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నేతలు తెలిపారు. మొత్తం రూ.133.50కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారని వెల్లడిం చారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ఇవన్నీ డబులైన రోడ్స్‌ ప్రతిపాదనలు కావడంతో ఈ రహదారులు పూర్తయితే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వారు వివరించారు.

Updated Date - Sep 20 , 2024 | 12:30 AM